పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/375

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
356
అంతానికి ఆరంభం


తగిలే దెబ్బను గురించి యోచించమని మాకు సూచించారు. నాకిదంతా తెలుసు. భారతీయులందరితో చర్చించాను. ఒక నిర్ణయానికి వచ్చాము. కమీషన్ సభ్యుల సంఖ్య పెంచకపోతే ఎంత పెద్ద ప్రమాదం సంభవించినా సరే ఎదుర్కొని కమీషన్‌ను బహిష్కరించి తీరాలి అనునదే మా ఆ నిర్ణయం. 100 పౌండ్లు ఖర్చు పెట్టి పెద్ద తంతి ద్వారా యీ వివరమంతా శ్రీ గోఖలేగారికి తెలియజేశాము. అందుకు శ్రీ ఎండ్రూస్ కూడా సమ్మతించారు ఆ తంతి సారాంశం. “మీ ఆవేదనను మేము అర్థం చేసుకున్నాం. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి మీ సలహాను అంగీకరించాలనే మా కోరిక. లార్డ్‌హార్డింగ్ మాకు ఎంతో విలువైన సహాయం చేశారు. వారి సాయంచిపరి వరకు లభిస్తూ వుండాలని మేము కోరుకుంటున్నాం. అయితే మీరు మా స్థితిని తెలుసుకోవాలని కోరుతున్నాం. యిది వేలాది మంది ప్రజల ప్రతిజ్ఞకు సంబంధించిన విషయం .

మా ప్రతిజ్ఞ పరిశుద్ధమైనది. మేము చేస్తున్న సంగ్రామం పూర్తిగా పరిశుద్ధమైన ప్రతిజ్ఞల పునాది పై నిర్మాణ మైంది. ప్రతిజ్ఞా బంధనమే లేకపోతే మాలో చాలా మందిమి క్రిందికి జారి పడిపోయి వుండేవారమే. వేలాది మంది ప్రజలు ముక్తకంఠంతో చేసిన ప్రతిజ్ఞను మేము ఉపసంహరిస్తే ఇక నైతిక బంధనమనే దానికి తావే వుండదు ప్రతిజ్ఞ చేసేముందు భారతజాతి ప్రజలు క్షుణ్ణంగా చర్చించారు. ఏవిధమైన అవినీతికి యిందు తావులేదు. కమీషన్‌ను బహిష్కరించాలని ప్రతిజ్ఞ చేసే అధికారం ప్రజలకున్నది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోను, మిన్ను వచ్చిమీద విరిగిపడినా వెరువకుండా ప్రతిజ్ఞను పాలించమని మాకు సలహా యిమ్మని మిమ్ము కోరుతున్నాం. దయ యుంచి మా యీ తంతిని శ్రీ లార్డ్ హార్డింగ్ గారికి కూడా చూపించండి. మీ పరిస్థితి గందరగోళంలో పడకూడదని మేము కోరుతున్నాము. మేమీ సంగ్రామం భగవంతుని సాక్షిగా పెట్టుకొని ఆయన సహాయం మీద ఆధారపడి ప్రారంభించాము. పెద్దల గౌరవనీయుల సహాయం మేము కోరుతున్నాము. మీ సహాయం లభించగానే మేము సంతోషిస్తున్నాము. అయితే ఏది ఏమైనా సరే పరిశుద్ధ హృదయంతో చేసిన ప్రతిజ్ఞమ పాలించాల్సిందేననునది మా