పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/374

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
355
సత్యాగ్రహ చరిత్ర

అయితే జనరల్ స్మట్సు కమీషన్ మెంబర్లను మార్చడానికి, క్రొత్తవారిని చేర్చడానికి అంగీకరించలేదు. కమీషన్ నియామకం కేవలం తన తృప్తికోసం ప్రభుత్వం చేసింది అని స్మట్సు సమాధానం పంపాడు. డిసెంబరు 24వ తేదీన స్మట్సు జాబుమాకు అందింది యిక మాకు వేరే మార్గం మిగల లేదు. మేము జైలుకు వెళుతున్నామని ప్రకటించాం 1914 జనవరి 1 వ తేదీన డర్బను నుంచి జైలుకు వెళ్లే భారతీయుల బృందం యాత్రాదళంగా బయలు దేరుతుందని కూడా ప్రకటించాం. అయితే జనరల్ స్మట్సు వ్రాసిన ఉత్తరంలో ఒక వాక్యం వున్నది

"మేము పక్షపాతం లేకుండా, కోర్టు కమీషన్‌ను నియమించాము దాన్ని నియమిస్తున్నప్పుడు మేము భారతీయుల నెవ్వరితోను సలహా సంప్రతింపులు జరుప లేదు. అదే విధంగా గనుల యజమానులతోను, పట్టణవాసులలోను కూడా సలహా సంప్రతింపులు జరపలేదు. అన్నదే ఆవాక్యం అది చదివి నేను వ్యక్తిగత హోదాలో యీ విషయమై మిమ్ము కలిసి మాట్లాడుతాము కొన్ని వివరాలు మీకు అందజేస్తాము తేదీ, సమయం నిర్ణయించి తెలియజేయండి. అని జాబు పంపాను జనరల్ స్మట్సు అందుకు అంగీకరించాడు. అందువల్ల మా యాత్ర కొద్ది రోజులు వాయిదా పడింది. మేము కాలినడకన యాత్రాదళంతో బయలుదేరనున్నామని తెలిసి శ్రీ గోఖలే నాకు ఒక పెద్ద తంతి పంపారు. మీరు యీ విధంగా చేస్తే యిక్కడ లార్డ్ హార్డింగ్ స్థితి, నా స్థితి కూడా గందరగోళంలో పడుతుంది. కనుక మీరు యీ యాత్ర చేయకండి ఆ కమీషనుకు సహకరించండి." అని ఆ తంతియొక్క సారాంశం.

మేము ధర్మ సంకటంలో పడిపోయాము. కమీషన్ సభ్యుల సంఖ్య పెంచకపోతే కమీషనును బహిష్కరించాలని భారతజాతి తీర్మానించింది ప్రతిజ్ఞ కూడా చేసింది. లార్డ్ హార్డింగ్‌కు కోపం వస్తుందనో, శ్రీ గోఖలే గారికి దుఃఖం కలుగుతుందనో భావించి చేసిన ప్రతిజ్ఞను ఉపసంహరించడం ఎలా సాధ్యం? శ్రీ అండ్రూస్ కల్పించుకొని గోఖలేగారి భావాల్ని అతి సున్నితంగా వున్న వారి అనారోగ్యాన్ని, మా యీ నిర్ణయం వల్ల గోఖలే గారి హృదయానికి