పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

353


జరిగిన అన్యాయాల్ని అపివేయాలని ప్రతివాడూ ఆశిస్తున్న సమయం వచ్చేసింది. జనరల్ స్మట్సుకు మాత్రం యీ విషయం తెలియదా? కాని అతరు పాము చుంచు ఎలుక స్థితిలో పడిపోయాడు. అతడు యిప్పుడు న్యాయం చేయాలి. అయితే న్యాయం చేయగల శక్తి అతడు పోగొట్టుకున్నాడు నేను మూడు పౌండ్ల తలపన్నును రద్దు చేయను, మరే మార్పూ చేయను అని దక్షిణాఫ్రికా యందలి శ్వేత జాతీయులకు, జనరల్ స్మట్సు స్పష్టంగా చెప్పాడు. కాని పరిస్థితి మారిపోయింది మార్చను అని అన్న వాటినన్నింటినీ మార్చక తప్పలేదు. ప్రజాభిప్రాయానికి భయపడే ప్రభుత్వాలు యిలాంటి సమయంలో సామాన్యంగా ఏదో ఒక కమీషన్ వేసి, అది యిచ్చే రిపోర్టు కోసం ఎదురు చూస్తాయని చెప్పడం సహజంగా జరుగుతూ వుంటుంది. జనరల్ న్మట్సు కూడా అదే పని చేశాడు. ముగ్గురు సభ్యులతో ఒక కమీషను నియమించాడు. కాని భారతజాతి యీ కమిషన్ నియామకానికి గల ఉద్దేశ్యాలేమిటో ప్రకటించమనీ, అలా చేయకపోతే బహిష్కరిస్తామనీ ప్రకటించింది. యీ క్రింది షరతులు కూడా విధించింది. 1. జైళ్లలో మగ్గుతున్న సత్యాగ్రహులనందరినీ తక్షణం విడుదల చేయాలి 2. కమీషన్‌లో కనీసం ఒక్క భారతీయుడినైనా సభ్యుడుగా నియమించాలి. యీ రెండు షరతులు ప్రభుత్వానికి తలనొప్పి కలిగించాయి. అయితే గత్యంతరం లేక కమీషనే శ్రీ కెలన్‌బెక్, శ్రీ పోలక్, శ్రీ గాంధీల్ని షరతులేమీ పెట్టకుండా తక్షణం విడుదల చేయమని ప్రభుత్వానికి సలహా యిచ్చింది. ఆ ప్రకారం ప్రభుత్వం మమ్మల్ని ముగ్గురినీ (1913 డిసెంబరు 18న) విడుదల చేసింది. మేము ఏడువారాలు జైల్లో వున్నాము.

శ్రీ వెస్టును అరెస్టు చేశారేగాని ఆయనపై కేసు పెట్టాలంటే ఆధారం ఏమీ దొరకలేదు. అందువల్ల వారిని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అండ్రూస్, పియర్సన్ దక్షిణాఫ్రికాకు రాక పూర్వమే యీ ఘట్టాలు జరిగాయి. అందువల్ల నేనే డర్బన్ వెళ్లి మిత్రులిద్దరికి స్వాగతంచెప్పి తీసుకు వచ్చాను. యి. సమాచారమేమీ తెలియనందున నన్ను ఓడలో చూచి మిత్రులిద్దరూ ఆశ్చర్యపడ్డారు. ఆనందంతో పొంగిపోయారు. వారిరువురివీ మొదటిసారి కలిశాను.