పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

చరిత్ర

నేను సంకోచించకుండా బోయర్ల ప్రతాపాన్ని. వాళ్ల స్వాతంత్రేచ్చను, వాళ్ల ఆత్మత్యాగాన్ని గురించి వివరించాను. అయితే కష్టకాలంలో సైతం వాళ్లలొ వాళ్లకు అభిప్రాయభేదాలు కలుగలేదని గాని, వారిలో బలహీనమనస్కులు లేరని చెప్పుడం గాని నా ఉద్దేశ్యం కాదు లార్డ్ మిల్నర్ బోయర్ల నుంచి తేలికగా తృప్తి పడే ఒక వర్గాన్ని తయారు చేసినిలబెట్టాడు వాళ్ల సహాయంతో అసెంబ్లీ వ్యవహారం చక్కబెట్టగలనని ఆయన భావించాడు ఎంత గొప్ప నాటక రచయిత అయినా. ప్రధాన పాత్ర లేకుండా నాటకాన్ని ఆడించి రక్తికట్టించలేడు. అలాంటిది యీ కఠిన కఠోర ప్రపంచంలో రాచకార్యాలు చక్కదిద్దేరాజపురుషుడు ముఖ్యపాత్రని మరిచి అంతా తానే చేయగలనని అనుకుంటే పిచ్చితనం కాక మరేమవుతుంది? యిదే స్థితి లార్డ్ మిల్నర్‌కి పట్టింది. లార్డ్‌మిల్నర్ తీవ్ర పదజాలంతో జనరల్ బోధాను తిరస్కరించాడే, కాని ఫ్రీస్టేట్ పరిపాలన జనరల్ బోధా సహకారం లేనిదే జరగడం సాధ్యం కాదని తేలేసరికి లార్డ్‌మిల్నర్ తనతోటలో కాలుగాలిన పిల్లిలా తిరిగేవాడని చెబుతారు. జనరల్ బోధా తన అభిప్రాయాల్ని స్పష్టంగా ప్రకటించాడు. ఫ్రీనిఖస్ సంధి వల్ల బోయర్ ప్రజలకు తమ పరిపాలన చేసుకొను పూర్తి హక్కు అధికారం వెంటనే లభిస్తుందని విశ్వసించారు లేకపోతే నేను ఆసంధ పత్రం మీద సంతకం చేసి యుండేవాణ్ణికాను అని స్పష్టంగా ప్రకటించేసరికి, లార్డ్ కిచనర్ అందుకు సమాధానం చెబుతూ నేను జనరల్ బోధాకు ఆవిధంగా చెప్పలేదు. బోయర్ ప్రజలు విశ్వాసపాత్రులని ఋజూ అయిన కొద్దీ వారికి స్వతంత్రం లభిస్తూ వుంటుంది అని మాత్రమేచెప్పాను అని ప్రకటించాడు. వీరిద్దరి మధ్య న్యాయం చెప్పేది ఎవరు? మధ్యవర్తి ద్వారా పరిష్కారం చేద్దాం అని అంటే జనరల్ బోధా అంగీకరిస్తాడా? అయితే ఇంగ్లాండులో గల పెద్ద ప్రభుత్వం మాత్రం చేసిన న్యాయ నిర్ణయం దాని గౌరవప్రతిష్టల్ని ఎంతో పెంచిందని చెప్పవచ్చు. ఆ ప్రభుత్వ నిర్ణయ ప్రకారం బలవత్తరంగా వున్న పక్షాన్ని మినహాయించి, బలహీనంగా వున్న పక్షం చెప్పిన దాన్ని అంగీకరించి తీరాలి

న్యాయము, సత్యము రెంటి దృష్ట్యా వారు చెప్పిందే న్యాయ సమ్మతం