పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

19


కొందరు ఇంగ్లీషు మేధావుల ద్వారా ఇంగ్లాండుకు అందేసరికి అక్కడి జనం విచారసాగరంలో మునిగి పోయూరు యీ సమాచారం బోయర్ పురుషుల ద్వారా ఇంగ్లాండు చేరలేదు. వారంతా యుద్ధరంగాల్లో పోరాటం సాగిస్తున్నారు కాంపుల్లో అష్టకష్టాలు సహిస్తున్న బోయర్ స్త్రీల ద్వారా కూడా యీ సమాచారం ఇంగ్లాండు చేరలేదు ఆంగ్ల ప్రజల హృదయావేదనను తెలుసుకొని కీ. శే. సర్‌హెనరీ కాంప్‌బెల్ బైనర్‌మెన్ బోయర్ యుద్దానికి వ్యతిరేకంగా గర్జించారు. కీ. శే. స్టెడ్ అను వారు బహిరంగంగా బోయర్ యుద్ధంలో ఇంగ్లీషు ప్రభుత్వం ఓడిపోవాలని దేవుని ప్రార్థించడమేగాక ప్రజలందరినీ ఆ విధంగా ప్రార్థనలు చేయమని ప్రోత్సహించారు. దానితో గొప్ప చమత్కారం జరిగిపోయింది. సాహసంతో కష్టాల్ని సహించే శక్తిని చూచి రాళ్లైనా కరిగిపోతాయని అది తపస్సు యొక్క మహిమయని, అదే సత్యాగ్రహశక్తి అని స్పష్టంగా తేలిపోయింది

దానితో ఫ్రీనిఖన్ ఒడంబడిక జరిగింది. తద్వారా దక్షిణాఫ్రికా యందలి నాలుగు అధినివేశ రాజ్యాలు ఒక యూనియన్ క్రిందికి వచ్చాయి. పత్రికలు చదివే భారతీయులకు ఆ సంధి విపరాలు తెలిసియే యుంటాయి అయినా రెండు మూడు విశేషాలు చెప్పడం అవసరు ఫ్రినిఖన్ సంధి జరగగానే నాలుగు రాజ్యాలు వెంటనే ఏకంకాలేదు ప్రతి అధినివేశ రాజ్యానికి ఒక అసెంబ్లీ ఏర్పడింది. అక్కడి మంత్రి మండలి మాత్రం ఆ అసెంబ్లీకి పూర్తిగా జవాబుదారీ వహించదు. ట్రాన్సవాల్ మరియు ఫ్రీస్టేట్ యొక్క పరిపాలనా పద్ధతి. క్రౌస్ కాలనీ యొక్క పరిపాలనా పద్దతి వలె వున్నది. యిలాంటి సంకుచిత అధికారం జనరల్ బోధాకు గాని, లేక జనరల్ స్మట్సుకు గాని సంతృప్తికలిగించలేదు. అయినా లార్డ్ మిల్నర్ వరుడు మినహా కన్యాదానం పద్ధతిని అనుసరించడం మంచిదని భావించాడు. జనరల్ బోధా. జనరల్ స్మట్సు యిద్దరూ అసెంబ్లీకి దూరంగా వుండిపోయారు వారు సహకరించలేదు అట్టి ప్రభుత్వంతో ఏ విధమైన సంబంధం పెట్టుకోడానికి వారు నిరాకరించారు లార్డ్ మిల్నర్ కటువైన ప్రసంగం చేశాడు. లార్డ్ జనరల్ బోధా మొత్తు బాధ్యతంతా తనదేననీ, లేక తన మీదే ఉన్నదనీ భావించకూడదనీ, బోధా లేక పోయినా రాజ్యకార్యాలు జరుగుతాయని మిల్నర్ ప్రసంగ సారాంశం