పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

338

జనమంతా జైళ్లలో


ఎక్కడికి వెళితే అక్కడ, పోలక్ అందరికీ సహాయకారి అయ్యే స్వభావం కలవారు, చేపట్టిన కార్యక్రమంలో పూర్తిగా లీనం కావడం వారికి అలవాటు. ఆయనను . ఇండియా పంపుటకు ఏర్పాట్లు జరిగాయి. నేను వారికి జూబు వ్రాశాను. మిమ్మల్ని కలిసి మాట్లాడి, మీ సలహాలు, ఆదేశాలు తీసుకొని ఇండియా వెళతానని శ్రీ పోలక్ నాకు వ్రాశారు. అది మా యాత్ర జరుగుతున్న సమయం. వారిని కూడా అరెస్టు చేయవచ్చు. దాన్ని దృష్టి యందుంచుకొని వచ్చి కలవవచ్చునని తంతి పంపాను. పోరాటపటిమకల వాళ్లు కష్టాలకు వెరువరుకదా! ప్రభుత్వం అందరినీ అరెస్టు చేస్తే మంచిదని, అసలు అరెస్టు కావడానికే గదా సత్యాగ్రహం ప్రారంభించింది. అవి సత్యాగ్రహుల ఆభిప్రాయం శ్రీ పోలక్ అరెస్టుకు సిద్ధపడి వచ్చి నన్ను కలిశారు.

మేము హెడల్‌బర్గ్ చేరాము. శ్రీ పోలక్ అక్కడకు దగ్గరలోనేవున్నరైలు స్టేషనులో దిగి కాలినడకన వచ్చి నన్ను కలిశారు. మా సంభాషణ పూర్తి అయింది. మధ్యాహ్నం సుమారు మూడు గంటలైంది. మేమిద్దరం యాత్రాదళానికి ముందు నడుస్తున్నాం. మిత్రులు దళంలో ఉండి మావెనుక నడుస్తున్నారు. డర్సన్ వెళ్లే రైలు సాయంత్రం బయలుదేరుతుంది. శ్రీ పోలక్ ఆ బండి అందుకోవాలి. శ్రీరామచంద్రుని వంటివాడికే వనవాసం తప్పలేదు. ఇక శ్రీ పొలక్‌కు మాత్రం తప్పుతుందా? మేము మాట్లాడుతూ వుండగా ఒక గుర్రంబండివచ్చి ఎదురుగా నిలబడింది. అందు ఏషియాటిక్ విభాగం అధికారి శ్రీ చిమనీ మరియు ఒక పోలీసు అధికారి వున్నారు. ఇద్దరూ బండి దిగారు. నా దగ్గరికి వచ్చి “మిమ్ము అరెస్టు చేస్తున్నాం" అని అన్నారు. నాలుగురోజుల్లో నాలుగోసారి నన్ను అరెస్టు చేస్తున్నారన్నమాట.

"యాత్రాదళం సంగతి ఏమిటి?" అని అడిగాను. "అంతా సరిగానే జరుగుతుంది." నేనేమి మాట్లాడలేదు. మీ అరెష్టు విషయం అనుచరులకు చెప్పవచ్చునని అధికారి నాకు చెప్పాడు. శ్రీ పోలక్‌ను ధళాన్ని నడపమని చెప్పి, నేను యాత్రా దళ సభ్యులకు, వివరమంతా, చెప్పసాగాను "మీరు యిప్పుడు ఖైదీ, ఉపన్యాసం యివ్వడానికి వీలులేదు" అని అన్నాడు. అధికారి.