పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334

ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశం - 2


పన్నును రద్దు చేయమని విన్నవించాలని మాత్రమే భావిస్తున్నారు. వాళ్లు శౌర్యవంతులే. వాళ్లు ఏమీ గొడవ చేయరు మితో యుద్ధం చేయరు మీరు గుండ్ల వర్షం కురిపించినా సహించి ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశిస్తారు. వారు మీ గుండ్లకు, బలాలకు వెరిచే మనుష్యులు కారు. వాళ్లు స్వయంగా కష్టాలు సహించి మీ హృదయాలను కరిగించాలని భావిస్తున్నారు. వాళ్లు మాటలు వింటే మీ హృదయాలు కరిగి పోతాయనే విశ్వాసం నాకున్నది. ఈ విషయం చెప్పడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. ఈ రెండు మాటలు చెప్పి మీకు సేవయే చేశాను. జాగ్రత్త పడండి. అన్యాయం చేయకండి," అని చెప్పి కెలన్‌బెక్ మౌనం వహించారు. సభకు వచ్చిన జవం ఎక్కువ మంది సిగ్గుపడ్డారు. ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించిన తెల్లవాడు శ్రీ కెలన్‌బెక్‌కు మిత్రుడుగా మారిపోయారు.

ఈ సభను గురించిన వివరం మాకు ముందుగానే తెలిపినందుకు మా జాగ్రత్తలో మేము పున్నాం. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మొహరించినందువల్ల తెల్లవాళ్లు ఆఘాయిత్యం ఏమీ చేయకుండా వుండుటకు ఏర్పాటు . జరిగిందని భావించాం. ఏది ఏమైన మా యాత్రా బృందం శాంతంగా ముందుకు సాగింది. ఒక్క తెల్లవాడు కూడా మా విషయంలో యిబ్బంది కరంగా ప్రవర్తించలేదని నాకు గుర్తు చాలామంది శ్వేత జాతీయులు బయటికి వచ్చి మమ్ము చూడసాగారు. వారి నేత్రాల్లో స్నేహభావం కవబడసాగింది.

మొదటిరోజున బాక్స్‌రస్ట్‌కు సుమారు ఎనిమిది మైళ్ల దూరానగల ఒక స్టేషన్ పామ్ ఫోర్డ్ దగ్గర మేము ఆగాలి. సాయంత్రం 5-6 గంటలకు మేము అక్కడికి చేరాము. యాత్రికులు డబల్ రొట్టె, పంచదారతో తిని తెరవ గాలిలో పడుకున్నారు. కొందరు భజనలు చేస్తుంటే, కొందరు మాట్లాడుకుంటూ వున్నారు. త్రోవలో కొందరు స్త్రీలు అలిసిపోయారు. తమ పిల్లల్ని ఎత్తుకొని నతుస్తామని వచ్చారు కాని అలసిపోయి యింక ముందుకు నడవలేని స్థితిలో వున్నారు. అందువల్ల నచ్చచెప్పి వాళ్లను ఒక మంచి భారతీయ వ్యాపారస్తుని దగ్గర ఖవరం చుట్టారు. వీళ్లంతలు కర్నూయి. ప్రజలకు మందము