పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

318

జైల్లో స్త్రీలు


నెరవేర్చలేదు. ఏవేవో విఘ్నాలు వచ్చాయని చెప్పారు. పరస్పర కలహాలు బయలుదేరాయి ముఖ్యకార్యకర్తలు ఒకరి తరువాత మరొకరు చనిపోయారు రాళ్లతో భవనం తయారైనా కాకపోయినా పలియమ్మ బలిదానం అమోఘం, అద్భుతం ఆమె సేవాధర్మం, బలిదానం ఆమె కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో భారతదేశం జీవించి యున్నంతకాలం నిలిచి యుంటాయి

ఈ సోదరీ మణుల త్యాగం పవిత్రమైనది చట్టమందలి సూక్ష్మాలు వాళ్లకు తెలియవు. చాలా మంది సోదరీమణులకు దేశమంటే ఏమిటో తెలియదు. వాళ్ల దేశప్రేమకు ఆధారం కేవలం శ్రద్ధయే చాలామందికి చదువురాదు పత్రికలు ఏం చదువుతారు? కాని స్వాభిమానమనే వస్త్రాపహరణం జరుగుతున్నదని వాళ్లు తెలుసుకున్నారు. వాళ్ల జైలు యాత్ర పరిశుద్ధమైనది అది ఒక యజ్ఞం వంటిది పవిత్ర యజ్ఞం మంచిఫలితాలు యిస్తుంది హృదయ పూర్తిగా చేసిన ప్రార్ధనను భగవంతుడు తప్పక వింటాడు. భక్తితో, నిస్వార్ధ బుద్ధితో పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఏది సమర్పించినా భగవంతడు స్వీకరిస్తాడు. కుచేలుడు పేదవాడు గుప్పెడు అటుకులు తీసుకొని వెళ్లి కృష్ణునికి సమర్పించాడు. అతడి పేదరికం తొలిగిపోయింది అందువల్ల భక్తి శ్రద్ధలతో చేసిన త్యాగం ఎన్నటికీ వ్యర్ధం కాదు కానేరదు ఒక్కటి మాత్రం నిజం వలియమ్మ ఆత్మబలిదానం ఫలితం సాధించింది ఇతర సోదరీమణుల త్యాగయజ్ఞం సఫలం అయింది.

స్వదేశీయజ్ఞంలోను, విశ్వయజ్ఞంలోను ఎన్నో ఆత్మలు త్యాగం చేశాయి ఈనాటికీ చేస్తున్నాయి. భవిష్యత్తులో కూడా చేస్తాయి. ఇదే నిజమైన త్యాగం ఒక్క సత్యాగ్రహి ఆత్మపవిత్రంగా వున్నా చాలు మొత్తం ఉద్యమం విజయం సాధించి తీరుతుంది. పృథ్వి సత్యంపై ఆధారపడి వున్నది. అనత్ అనగా అసత్యం, అసత్యమంటే లేదు అని అర్ధం సత్ అనగా సత్యం, అనగా ఉన్నది అని అర్థం.

అసత్యానికి తావే లేనప్పుడు అది ఎలా జయిస్తుంది? సత్ అనగా సత్యాన్ని అనగా ఉన్నదాన్ని ఎవడు లేకుండా చేయగలడు? ఇది సంపూర్ణ సత్యాగ్రహశాస్త్రం.