పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

జైల్లో స్త్రీలు


మూడు మూడు మాసాల చొప్పున కఠిన కారాగారశిక్ష విధించారు (1913 సెప్టెంబరు 23) ట్రాన్స్‌వాల్‌లో అరెస్టుకాని సోదరీమణులు యిక నేటాలులో ప్రవేశించారు. వాళ్లను అనుమతి పత్రాలు లేకుండా నేటాలులో ప్రవేశించినందుకు పోలీసులు అరెస్టు చేయలేదు. వాళ్లను అరెస్టు చేయకపోతే న్యూకేసల్‌లో మకాం చేసి బొగ్గు గనుల గిర్‌మిటియా కార్మికులను పనులకు పోవద్దని చెప్పవలసిందిగా కోరాము న్యూకేసల్ నేటాలునందలి బొగ్గు గనులకేంద్రం ఈ గనుల్లో భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. సోదరీమణులు తమ పని ప్రారంభించారు. వారి ప్రచారం కరెంటులా నలుదిసల ప్రాకింది. మూడు పౌండ్ల తలపన్ను కధ భారతీయ కార్మికుల హృదయాలను కలిచి వేసింది. వాళ్లు తమ పని మానివేశారు. ఈ వార్త నాకు తంతి ద్వారా తెలియజేశారు. సంతోషంతోపాటు గాబరా పడ్డాను. ఇక నేను ఏం చేయాలి? కార్మికుల్లో యింతటి మేల్కొలుపు వస్తుందని నేను ఊహించలేదు. నా దగ్గర డబ్బు లేదు. ఈ పనిని సంభాళించేందుకు నా దగ్గర మనుష్యులు లేరు ఇక నా కర్తవ్యమేమిటో గ్రహించాను. నేను న్యూకేసల్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అక్కడికి బయలుదేరాను.

ప్రభుత్వం యీ సోదరీమణుల్ని ఎలా వదులుతుంది? వారందరిని అరెస్టు చేశారు. ఫినిక్సు దళానికి విధించిన శిక్షయే వారికీ విధించారు పినిక్సు దళాన్ని వుంచిన జైల్లోనే వీరిని వుంచారు. (21 అక్టోబరు 1913) ఈ ఘట్టాల వల్ల దక్షిణాఫ్రికా యందలి భారతీయులు మేల్కొన్నారు. వారికి నూతనోత్సాహం కలిగించింది. సోదరీమణుల త్యాగాలు, బలిదానాలు భారత దేశాన్ని సైతం మేల్కొలిపాయి. సర్ పిరోజ్‌షా మెహతా తటస్థంగా వున్నారు. 1901లో నీవు దక్షిణాఫ్రికా వెళ్లవద్దని మందలిస్తూ నాకు చెప్పారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందనంత వరకు విదేశాలలో వుండే భారతీయులకు ముక్తి లభించదని వారి అభిప్రాయం. దక్షిణాఫ్రికా సత్యాగ్రహం వారి మీద ప్రభావం చూపలేదు. కాని స్త్రీలు పడ్డయాతనలను గురించి తెలియగానే వారిలో పెద్దమార్పు వచ్చింది. బొంబాయి టౌన్‌హాలల్లో జరిగిన సభలో పాల్గొని "స్త్రీలకు విధించిన కారాగారాశిక్ష వల్ల శాణ్తి ఎగిరిపోయింది. ఇక భారతదేశం శాంత