పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

315

(1) సౌ కస్తూరిభాయి మోహనదాస్ గాంధీ (2) సౌ. జయాకువర్ మణిలాల్ డాక్టర్ (3) కాశీఛగనలాల్ గాంధీ (4) సంతోక్ మగనలాల్ గాంధీ, (5) శ్రీ పారసీరుస్తమ్‌జీ జీవన్జీ (6) శ్రీ ఛగన్ లాల్ ఖుశాల్‌చంద్ గాంధీ (7) శ్రీ రాజీభాయి మణిభాయి పటేల్ (8) శ్రీ మగన్‌భాయి హరిభాయి పటేల్ (9) శ్రీ సోలోమన్ రాయపెన్ (10) భాయీ రామదాస్ మోహనదాస్ గాంధీ (11) భాయీ రాజుగోవింద్ (12) భాయీ శివపూజన్ బద్రీ (13) భాయిగోవిందరాజులు (14) కుప్పుస్వామి ముదలియార్ (15) భాయి గోగులదాస్ హంసరాజ్ (16) భాయి రవిశంకర్ తరసశీ సోఢా ఇక ఏమి జరిగిందో తరువాతి ప్రకరణంలో వివరిస్తాను




40

జైల్లో స్త్రీలు

సత్యాగ్రహుల దళం సరిహద్దు దాటి ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించిన అపరాధానికి జైలుకు వెళ్లుటకు సిద్ధపడింది. గత ప్రకరణంలో ప్రకటించిన పేర్లలో కొన్ని పేర్లు గలవారిని పోలీసులు పట్టుకోవచ్చు. నా విషయమై అలాగే జరిగింది. రెండు మూడు సార్లు పట్టుకున్న తరువాత సరిహద్దు దాటుతున్నప్పుడు పోలీసులు నన్ను పట్టుకొని వదిలివేశారు. ఈ దళం బయలు దేరుతున్నదని ఎవ్వరికీ తెలియచేయలేదు. ఇక అధికారులకు ఎందుకు తెలియచేస్తాం? పోలీసులకు కూడా మీ పేర్లు, చిరునామాలు చెప్పవద్దని యీ దళసభ్యులకు చెప్పాము. కోర్టులో మా పేర్లు చెబుతామని పోలీసులకు చెప్పమని వారికి చెప్పాము

పోలీసులు యిలాంటి వ్యవహారాలు చాలా చూచారు. భారతీయుల్ని అరెస్టు చేయడం అలవాటు అయిన తరువాత, పోలీసుల్ని కంగారు పెట్టుటకు వినోదంగా తమ పేర్లు వాళ్లకు సత్యాగ్రహులు చెప్పేవారు కాదు. అందువల్ల పోలీసులకు ఫినిక్సు దళం వారి వ్యవహారం విచిత్రమనిపించలేదు. ఈ దళాన్ని అరెస్టు చేశారు. వాళ్ల మీద కోర్టులో కేసునడిచింది. ప్రతిసత్యాగ్రహకి