పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

పెండ్లిని పెండ్లిగా గుర్తించకపోవుట


నిన్ను నా వెంట ఉండనీయగలనా? ప్రపంచం ఎదుట ఏముఖం పెట్టుకొని నిలబడగలను? ఆ భయం వల్లనే నేను నిన్ను ప్రోత్సహించలేదు" అని చెప్పాను. నా మాటలు విని "నేను ఓడిపోయి జైలునుంచి తిరిగి వస్తే నన్ను మీ వెంట వుండనీయవద్దు నా బిడ్డలు కష్టాపడతారా? మీరంతా కష్టాలు పడతారా? నేనొక్కదాన్ని కష్టాలు పడలేనా? నన్ను గురించి మీరు యిలా ఎందుకు ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా నేను యీ యుద్ధంలో పాల్గొని తీరతాను" అని అన్నది కస్తూరీబా,

"అయితే నేను నిన్ను యీ సంగ్రామంలో చేర్చి తీరతాను. నా షరతులేమిటో పూర్తిగా విన్నావు నా స్వభావం ఎటువంటిదో నీకు బాగా తెలుసు. ఇంకా సమయం వున్నది. ఆలోచించ తలిస్తే మరోసారి ఆలోచించు. లోతుగా ఆలోచించిన పిమ్మట సంగ్రామంలో చేరవద్దని నీవు అనుకుంటే నేనేమీ బాధపడను నీ యిష్టం వచ్చినట్లు చేయవచ్చు. నిర్ణయాన్ని మార్చుకోవడానికి యిప్పుడు కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు" అని నేను చెప్పాను. ఇక ఆలోచించవలసిన అవసరమేమీ లేదు. ఇది నా దృఢ నిర్ణయం అని ఆమె స్పష్టంగా చెప్పివేసింది. ఫినిక్సులో వుండే మిగతావారికి కూడా వారు స్వతంత్రంగా నిర్ణయాలు చేయుడని చెప్పాను పత్యాగ్రహసంగ్రామం కొద్దికాలంపాటు జరిగినా ఎక్కువ కాలం పాటు జరిగినా, ఫిసిక్సు ఆశ్రమం నిలిచివున్నా లేక మట్టిలో కలిసిపోయినా, జైలుకు వెళ్లినా సత్యాగ్రహులు ఆరోగ్యంగా వున్నా లేక జబ్బుపడినా, ఒక్క సత్యాగ్రహికూడా ఓడిపోయి జైలునుంచి విడుదల కాకూడదు. ఈ షరతు ఎన్నో పర్యాయాలు వారికి తెలియజేశాను. అంతా సిద్ధపడ్డారు. ఫినిక్సుకు బయటగల వారిలో కేవలం రుస్తుమ్‌జీ జీవణ్‌జీ ఘోరఖోదు మాత్రమే వున్నారు. వారిని ప్రేమతో కాకాజీ (పెద్దనాన్నా) అని అనేవారం. వారికి తెలియకుండా ఫినిక్సులో చర్చలు ఎలా చేయడం? వారు వెనక వుండే మనిషికాదు. ఒకసారి జైలుకు వెళ్లివచ్చారు. మళ్లీ, జైలుకు వెళతానని, వారి పట్టుదల.

ఆ దళంలో చేరిన సత్యాగ్రహుల పేర్లు యివి.