పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

పెండ్లిని పెండ్లిగా గుర్తించకపోవుట


వుంటున్నారు. వాళ్ల పెండ్లిండ్ల విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతా సవ్యంగా భారత దేశంలో వలెనే సాగిపోతున్నది. కాని అక్కడి కోర్టులో ఒక పెండ్లి విషయం దాఖలు అయింది. కేస్ సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి శ్రీ సర్లదొర 1913 మార్చి 14 వ తేదీన ఒక తీర్పు యిచ్చాడు. దక్షిణాఫ్రికాలో అమల్లో వున్నచట్టం ప్రకారం క్రైస్తవమత పద్ధతిన జరిగిన వివాహాలు తప్ప, వివాహాల అధికారి ఆఫీసులో రిజిష్టరైన వివాహాలు తప్ప, మరేరకమైన పెండ్లిండ్లు చెల్లవు" అనునదే ఆయన యిచ్చిన తీర్పు సారాంశం అంటే ఏమిటి? భారతదేశపు హిందువులు, ముస్లిములు పారసీకులు తమ తమ మతాల ప్రకారం చేసుకున్న వివాహాలు దక్షిణాఫ్రికాలో చెల్లవన్నమాట యిది ఆ జడ్జి యిచ్చిన ఒక భయంకరమైన తీర్పు. యీ తీర్పు ప్రకారం యిప్పుడు దక్షిణాఫ్రికాలో భార్యాభర్తలుగా చలామణీ అవుతున్న వారు యిక భార్యాభర్తలు కారన్నమాట యిప్పుడు భార్యల స్థాయిలో వున్న స్త్రీలకు అధికారం వుండదన్నమాట యిప్పుడు భార్యలుగా వున్న స్త్రీలు ఉపభార్యలుగా మాత్రమే పరిగణింప బడతారన్నమాట అట్టి భార్యలకు కలిగిన సంతానం అట్టి తండ్రులకు వారసులు కాజాలరన్నమాట యీ స్థితిని స్త్రీలు అంగీకరించరు. పురుషులు అంగీకరించరు. ఈ తీర్పువల్ల దక్షిణాఫ్రికాలో గల భారతీయుల్లో పెద్ద అలజడి బయలు దేరింది. "ఈ తీర్పును ప్రభుత్వం అంగీకరిస్తున్నదా? అని నేను ప్రభుత్వాన్ని అడిగాను. యిట్టి తీర్పు ఒక జడ్జీ యిచ్చాడు. కనుక, మరో చట్టాన్ని అంగీకరించి దాని ప్రకారం హిందూ ముస్లిం పారసీకుల మత సంబంధమైన వివాహాలన్నీ సక్రమమైనవని అంగీకరించి యిట్టి అక్రమమై తీర్పును చెల్లకుండా చేస్తారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. నా మాట వినే స్థాయిలో ప్రభుత్వం లేదు. అట్టి పెండ్లిళ్లు చెల్లవని ప్రభుత్వం నిర్ణయం తెలిపింది. జడ్జీ యిచ్చిన తీర్పును గురించి చర్చించుటకు భారతీయుల సభ జరిగింది. యీతీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయించవలసిందే కాని భారతీయులు కల్పించుకోకూడదని నిర్ణయించాము. ప్రభుత్వ వకీలు ద్వారా బహిరంగంగా తీర్పుకు వ్యతిరేకంగా అపీలు చేయవలసిందే. ప్రభుత్వం భారతీయుల పక్షం వహించినప్పుడే