పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

309


వుంటుందని భావించాము పోరాటాన్ని ప్రారంభించటానికి మేము సన్నాహాలు చేస్తుండగానే మరో కొత్త విఘ్నం వచ్చి పడింది. ఇక యిప్పుడు పోరాటంలో స్త్రీలకు కూడా అవకాశం లభించింది. కొంతమంది వీర నారీమణులు పోరాటంలో పాలుపంచుకునేందుకు వీలు కల్పించమని అడిగారు. ప్రవేశ పత్రాలను చూపించకుండా జైలు కెళ్ళేందుకు తమ యిష్టాన్ని వ్యక్తం చేశారు. కానీ అప్పుడు విదేశాల్లో స్త్రీలను జైళ్లకి పంపటం అనుచితం అని మాకనిపించింది. వాళ్ళని జైళ్లకి పంపేందుకు తగిన కారణమూ కనిపించలేదు. నా సంగతి చెప్పాలంటే స్త్రీలను జైళ్లకు పంపాలంటే నాకు భయంగా వుండేది పైగా పురుషులపైన మోపే చట్టాన్ని రద్దు చేయించటం కోసం స్త్రీలను ఆహుతి చేయటం పురుషులకు అవమానకర విషయమని కనిపించింది కానీ స్త్రీలను అవమాన పరచే సంఘటన ఒకటి జరిగి యీ అవమానాన్ని తొలగించుకోవాలంటే స్త్రీలను ఆహుతి చేయడం తప్పుకాదన్న అభిప్రాయం కూడా మాకు కలిగింది




39

పెండ్లిని పెండ్లిగా గుర్తించకపోవుట

దక్షిణాఫ్రికాలో భారతీయులెవ్వరూ ఊహించడానికైనా వీలులేని ఘట్టం ఒకటి జరిగింది. బహుశ యిట్టి ఘట్టం ద్వారా భగవంతుడు భారతీయుల విజయానికి బాట వేసాడేమోనని భావిస్తున్నాను దేవుడు ఆంగ్లేయుల దుర్మార్గ ప్రవృత్తిని అదృశ్యంగా వుండి బహిరంగం చేయదలచాడేమోనని కూడా భావిస్తున్నాను. భారత దేశాన్నుంచి దక్షిణాఫ్రికా వచ్చిన వారిలో చాలామంది పెండ్లి అక్కడే చేసుకొని వచ్చిన వాళ్లు వున్నారు. కొందరు దక్షిణాఫ్రికా వచ్చిన తరువాత పెండ్లి చేసుకున్నారు. భారతదేశంలో సామాన్యంగా జరిగే చాలా పెండ్లిండ్లమ రిజిష్టరు చేయించరు. ధార్మిక పద్ధతులు అక్కడ సరిపోతాయి. దక్షిణాఫ్రికాలో సైతం యీ పద్దతినే అంగీకరించి యుంటే బాగుండేది. 40 సంవత్సరాల నుంచి అనేక మంది భారతీయులు దక్షిణాఫ్రికా వచ్చి