పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

వాగ్దాన భంగం


వరకూ వ్రాసి పంపినట్టు గుర్తు. ఇంత తక్కువ మందికోసం భారతదేశం నుండి ఆర్థిక సహాయం కోరను. ఈ విషయంలో మీరు నిశ్చింతగా వుండండి మీ ఆరోగ్యానికి ఎలాంటి ఒత్తిడీ కలిగించవద్దని కూడా వ్రాశాను. దక్షిణాఫ్రికా నుండి బొంబాయి తిరిగి వెళ్ళిన తరువాత కేంద్ర ప్రభుత్వంతో జరిగిన సంభాషణల్లో నిశ్శబ్దం కనిపించినట్లు ఆక్షేపణలు చేయబడ్డాయని వార్తా పత్రికల ద్వారా తెలిసిన వ్యక్తుల ద్వారా నాకు వార్త వచ్చింది. అందువల్ల డబ్బు పంపమని హడావిడి చేయటం నాకు యిష్టం లేదు. కానీ గోఖలే గారి నుండి ఘాటైన వుత్తరం వచ్చింది . దక్షిణాఫ్రికాలో మీ ధర్మాన్ని మీరెలా నిర్వర్తిస్తున్నారో, భారతదేశంలో మేమూ మా ధర్మాన్ని విలువైనదిగా భావిస్తాం మేము ఏంచేయటం ఉచితమో ఏమి చేయటం అనుచితమో చెప్పే అవకాశం మీకు యివ్వం నేను కేవలం అక్కడి పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నాను మేమేమి చేయాలో మిమ్మల్ని చెప్పమని అడుగలేదు " గోఖలే గారి మాటలలో అంతరార్థం నాకు తెలిసింది. తరువాత యీ విషయంలో ఒక్కమాట నేనూ వ్రాయలేదు. వారూ వ్రాయలేదు. అదే లేఖలో వారు నాకు సాంత్వనతో పాటు హెచ్చరికను కూడా పంపారు ప్రభుత్వమిలా మాట తప్పటం వల్ల పోరాటం ఎక్కువ రోజులు జరుగవచ్చునని అభిప్రాయపడ్డారు. పిడికిలి నిండనంత మంది సత్యాగ్రహులు ఎన్నిరోజులు ప్రభుత్వంతో తలపడగలరు అని వారికి అనుమానం కలిగింది. ఇక్కడ దక్షిణాఫ్రికాలో మేము సమర సన్నాహాలు ప్రారంభించాం

ఈ యుద్ధంలో శాంతిగా కూర్చోవటం సాధ్యం కాదు. సత్యాగ్రహులు చాలా కాలం జైల్లో కూర్చోవలసి వస్తుందని మాకు అర్థమైంది. టాల్‌స్టాయ్ ఆశ్రమాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నాం. కొన్ని కుటుంబాలు తమ వాళ్లు జైలు నుండి విడుదలైన తరువాత తమ ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. మిగిలిపోయిన వారిలో ఫినిక్స్ వాసులు మాత్రమే వున్నారు. అందువల్ల సత్యాగ్రహుల కేంద్రంగా ఫినిక్స్‌ను చేసేందుకై నిశ్చయించాము దానికి కారణం మూడు పౌండ్ల పోరాటంలో పాలుపంచుకుంటున్న గిర్‌మిటియా కార్మికులతో కలవడానికి నేటాల్ నందలి ప్రాంతం కంటే యిదే సౌకర్యంగా