పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

గోఖలే యాత్ర - 2


లోని వజ్రాల ఖజానా కూడా ఆయన చూచారు. కింబరలీ డర్బన్‌లలోనూ స్వాగత సమితులు జోహన్స్‌బర్గ్‌లోలా విందులు ఏర్పాటు చేశాయి. వాటిలో చాలామంది. ఆంగ్లేయులు పాల్గొన్నారు. ఇలా భారతీయుల ఆంగ్లేయుల హృదయాలు దోచి 17 నవంబర్ 1912న గోఖలే దక్షిణాఫ్రికా తీరాన్ని వదిలారు. నేనూ కెలన్ బెక్ వారి కోరిక మేరకు ఝాంఝీబార్ దాకా వారికి వీడ్కోలు చెప్పేందుకై వెళ్ళాం. నౌకలో వారికి అనుకూలమైన ఆహార పదార్థాలు ఏర్పాటు చేశాము. మార్గమధ్యంలో దెలగోవాబే, ఇస్లామ్‌బేన్, ఝాంఝీ బార్ మొదలైన ఓడ రేవుల్లో వారికి గొప్ప సత్కారాలు జరిగాయి ఓడలో మా మధ్య కేవలం భారతదేశానికి సంబంధించిన విషయాలు దేశం పట్ల మా ధర్మానికి సంబంధించిన విషయాలు చోటు చేసుకున్నాయి. వారి ప్రతిమాటలోనూ వారి కోమల భావాలు సత్యపరాయణత స్వదేశాభిమానం ఉట్టి పడేవి ఓడమీద వారు ఆడే ఆటల్లోనూ భారతదేశం పట్ల సేవాభావమే తొణికిసలాడేది. ఆటల్లోనూ వారి ధ్యేయం పరిపూర్ణతను సాధించడమేనని మాకు బోధపడింది

ఓడపై తీరిగ్గా మాట్లాడుకునేందుకు మాకు చాలా సమయం దొరికింది నన్ను భారతదేశం తిరిగి రమ్మని చెప్పారు. భారత దేశ నాయకులను గురించిన వివరాలన్నీ వారు నా ముందు వుంచారు. తరువాత ఆ నాయకులతో నాకు కలిగిన అనుభవాలకూ గోఖలే గారు వారి గురించి వివరించిన తీరుకు ఏమీ భేదం కనిపించలేదు.

గోఖలే గారి దక్షిణాఫ్రికా యాత్రలో నాకు ఎన్నో పవిత్రమైన అనుభవాలు కలిగాయి. వాటిని నేనిక్కడ వర్ణించగలను. కానీ సత్యాగ్రహ చరిత్రతో వాటికి సంబంధం లేదు కనుక వాటిని కూడా యిష్టంలేకపోయినా ఆపివేస్తున్నాను ఝాంజీ బార్‌లో గోఖలే గారితో మాకు జరిగిన వీడ్కోలు నాకూ కెలన్‌బెక్‌కూ చాలా దుఃఖాన్ని కలిగించింది. దేహధారులైన వారి మధ్య ఎంతో సన్నిహిత సంబంధాలు సైతం ఏనాడో ఒకనాడు అంతమవక తప్పదని మేమిరువురమూ సమాధానపడ్డాము. గోఖలేగారి భవిష్యద్వాణి నిజమై మేమిరువురమూ సంవత్సరం లోగా భారతదేశానికి వెళ్లవలసి వస్తుందని ఆశపడ్డాము. కానీ