పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

301


మేల్కొనే వున్నారు. నన్నూ పోలక్‌నూ కూడా నిద్రపోనీయ లేదు. ప్రతి విషయాన్ని సంపూర్తిగా తెలుసుకుని దాన్ని బాగా అవగతం చేసుకున్నారనటానికి నిదర్శనంగా ప్రతి ప్రశ్నకీ తన అభిప్రాయాలను నిర్దిష్టంగా మాముందు ప్రకటించారు కూడా. చివరికి వారు తృప్తి చెందారు. నేను మొదటినుంచీ నిర్భయంగానే వున్నాను.

రెండు గంటలు అంతకంటే మించియే మంత్రివర్గ సభ్యులతో గోఖలేగారు సమావేశమయ్యారు. అక్కడి నుండి వచ్చిన తరువాత వారు నాతో ఒక సంవత్సరం లోగా నీవు భారతదేశానికి తిరిగి రావాలి. అన్ని విషయాలూ నిర్ణయించబడ్డాయి. హత్యా సదృశచట్టం అంతమొందుతుంది. వలస చట్టం క్రింద వర్ణభేదం రద్దవుతుంది. మూడు పౌండ్ల పన్ను రద్దవుతుంది. అని అన్నారు. నేను అంతావిని - మంత్రి వర్గం భావాలు నాకెంత తెలుసునో మీకు తెలియవు. మీ ఆశావాదం నాకు నచ్చింది. కారణం నేనూ ఆశావాదినే. కానీ చాలాసార్లు నిరాశ పాలైన నేను మీలా యీ విషయంలో ఆశపెట్టుకోలేను. కానీ నాకు భయం లేదు. మంత్రి వర్గపు వాగ్దానాన్ని మీరు మా కోసం పట్టుకొచ్చారు. నాకు యిది చాలు. అవసరమైతే ప్రభుత్వంతో పోరాడటం మా పోరాటం న్యాయబద్ధమైనదని నిరూపించటం నాధర్మం. దీనిలో మీరిచ్చిన హామీ మాకు లాభదాయకమే అవుతుంది. ఒకవేళ మళ్ళీ కొట్లాడవలసి వస్తే అప్పుడు కూడా మీ హామీ మాకు రెండింతలు బలాన్నిస్తుంది కానీ మరింత ఎక్కువమంది భారతీయులు జైళ్ళకి వెళ్ళకుండానే నేనొక సంవత్సరం లోపున భారతదేశానికి తిరిగి రాగలనని అనిపించటం లేదు" అని అన్నాను.

తరువాత గోఖలే అంతమాత్రాన నేను నీతో అన్న మాటలలో తేడా రాదు. జనరల్ బోధా హత్యా సదృశ చట్టం రద్దవుతుందనీ, మూడు పౌండ్ల పన్ను రద్దవుతుందనీ మాట ఇచ్చారు. పన్నెండు నెలల్లో నీవు భారతదేశానికి తప్పక రావలసి వుంటుంది. యిక నీ మాటలు నేను వినను" - అని అన్నారు.

ట్రాన్స్‌వాల్ నుండి గోఖలే. డర్బన్ మేరిల్స్‌బర్గ్ మొదలైన నగరాలకు వెళ్ళారు. అక్కడ కూడా అనేక మంది తెల్లవారిని ఆయన కలిశారు. కింబరలీ