పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

15


విషయం వచ్చింది. అసలు డచ్‌వాళ్లు ఎలా ముందుకు సాగారో చూద్దాం డచ్‌వాళ్లు పరాక్రమం గల యోధులు తెలివిగలరైతులు యిప్పటికీ వారి పరిస్థితియిదే తమ సమీపంలో నున్న దేశమందలి భూమి సారవంతమైనదని గ్రహించారు. అక్కడి ప్రజలు ఏడాది పొడవునా పనిచేయకుండా కొద్ది రోజులు కష్టపడి. అసంపాదనతో హాయిగా జీవితం గడుపుకుంటున్నారని తెలుసుకున్నారు

తమ దగ్గర తుపాకీ వున్నది తెలివి వున్నది. శక్తి వున్నది. యిక వీళ్లను లొంగదీసుకొని వీళ్ల చేత శ్రమ ఎందుకు చేయించకూడదు అనుభావం వారికి కలిగింది. పశుపక్ష్యాదుల మాదిరిగా యితర జనాన్ని కూడా లొంగదీసుకోగలమనే నిర్ణయానికి వాళ్లు వచ్చారు. యీ పనికి మతం అడ్డురాదనే నిర్ణయానికి కూడా వచ్చి దక్షిణాఫ్రికాకు చెందిన హబ్షీవాళ్ల చేత వ్యవసాయం చేయించడం మొదలు పెట్టారు.

డచ్ వాళ్లు ప్రపంచమందలి మంచి ప్రదేశాల కోసం వెతకడం ప్రారంభించినట్లే, ఇంగ్లీషు వాళ్లు కూడా అట్టి ప్రయత్నం ప్రారంభించారు మెల్లమెల్లగా ఇంగ్లీషువాళ్లుకూడా దక్షిణాఫ్రికాలో ప్రవేశించారు. డచ్‌వాళ్లు. ఇంగ్లీషువాళ్లు యిద్దరూ పెద్దతండ్రి పినతండ్రి కొడుకులే యిద్దరి స్వార్ధం ఒకటే, యిద్దరి స్వభావం ఒకటే ఒకే కుమ్మరి వాడు తయారుచేసిన కుండలు ఒక చోట చేరితే కొన్ని ఒక దానికింకొటి తగిలిపగిలి పోవడం సహజమే కజ డచ్‌వాళ్లు, ఇంగ్లీషు వాళ్లు మెల్లి మెల్లిగా దక్షిణాఫ్రికాలో కాళ్లు చాచడం ప్రారంభించి హబ్షీవాళ్లపై పాలన సాగిస్తూ ముందుకు సాగిసాగి ఒకరినొకరు ఢీకొన్నారు. యుద్ధాలు జరిగాయి మజూబా పర్వతం మీద ఇంగ్లీషు వాళ్లు ఓడిపోయారు కూడా యీ ఓటమి ఇంగ్లీషు వాళ్ల శరీరంపై పెద్ద పుండు అయిపోయి చివరికి 1899 నుంచి 1902 వరకు ప్రపంచ ప్రసిద్ధ బోయర్ యుద్భం రూపందాల్చి ముమ్మరంగా సాగింది జనరల్ క్రోవ్జేని, లార్డ్ రాబర్ట్స్ ఓడించి, వెంటనే విక్టోరియా మహారాణికి మజూబా పగతీర్చుకున్నాం అని తంతి పంపించాడు. వీరిరువురికి యుద్ధం ప్రారంభం కాకపూర్వం డచ్ వాళ్లు ఇంగ్లీషువాళ్ల పొడను సైతం అంగీకరించలేదు. వాళ్లు దక్షిణాఫ్రికా యందలి లోపలి భాగాలకు వెళ్లిపోయారు. దానితో ట్రాన్స్‌వాల్, ఆరెంజ్ రెండూ ఫ్రీ ప్రీస్టేట్లు అయ్యాయి.