పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

299


మరాఠీలో ప్రసంగిస్తే దాని భావార్థం వేను అర్థం చేసుకోగలను. దాన్ని అనర్థం చేయనని మాత్రం మీరే తెలుసుకుంటారు అని అన్నాను. మరాఠీ చక్కగా తెలిసిన వారికే యీ పనిని నేను అప్పగించగలను. కానీ మీకది నచ్చదు. కాబట్టి నన్నీ పనికి అనుమతించండి. మరాఠీలోనే ప్రపంగించండి. కొంకణీ, మరాఠీ సోదరులలాగా నాకు మీ మరాఠీ ప్రపంగాన్ని వినాలన్న అభిలాష వున్నది". నీవెప్పుడూ నీ మనసులోని మాటే చెబుతుంటావు. నీ ఆసరాతో నేనిక్కడ వున్నాను, కాబట్టి మరాఠీలో మాట్లాడటం కంటే మరో దారిలేదు అని నన్ను వారు సంతోషపెట్టారు. తరువాత యిలాంటి సభల్లో శుద్ధ మరాఠీలో వారు ప్రసంగిస్తే దానికోసమే నియమించబడిన అనువాదకునిలా నేను పని చేశాను. వీలైనంత వరకు మాతృభాషలో ప్రపంగించటం. వ్యాకరణశుద్దమైన ఆంగ్ల భాషలో కంటే వ్యాకరణ రహితమైన వచ్చీరాని హిందూస్తానీలో మాట్లాడటమే చాలా మంచిదన్న సంగతి గోఖలే గారికి అవగతమయ్యేలా చేశానో లేదో నాకు తెలియదు కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం నన్ను సంతోష పెట్టటానికి వారు మరాఠీలో ప్రసంగించారని తెలుసుకున్నాను. అలా మాట్లాడినందువల్ల పరిణామం మంచిగానే వుండటాన్ని వారూ గమనించారని నాకు ఆర్దమైంది. సిద్ధాంతాల ప్రసక్తి లేనిచోట సేవకులను సంతోష పరచటం మంచిదని గోఖలేగారు తన దక్షిణాఫ్రికా పర్యటనలో అనేక సందర్భాలలో తన ప్రవర్తన ద్వారా నిరూపించి చూపించారు.




37

గోఖలే యాత్ర - 2

జోహాన్స్‌బర్గ్ నుంచి మేము ప్రిటోరియాకు వెళ్ళవలసివుంది. అక్కడికేంద్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అతిధిగా వుండేందుకు ఆహ్వానం వచ్చింది, దాని ప్రకారం ట్రాన్స్‌వాల్ కోటలో వారు బస చేయవలసి వుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గంతో సమావేశ మవ్వాల్సివుంది. దానిలో జనరల్ బోధా, జనరల్ స్మట్స్ కూడా వున్నారు. ముందు చెప్పినట్టుగా ప్రతిరోజు కార్యక్రమాల