పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

గోఖలే యాత్ర - 1


బాగుండేదనో, ఒక్క ప్రత్యేకమైన విశేషణాన్ని తమ ప్రసంగంలో వాడకుంటే బాగుండేదనో నేను భావించినట్లు నాకు గుర్తులేదు. వారి భావాలలో స్పష్టత, దృఢత్వం వినయం ఉట్టిపడటానికి కారణం వారి పరిశ్రమ. సత్యనిష్ఠ

జోహాన్స్‌బర్గ్‌లో కేవలం భారతీయుల కోసం సభ జరుపవలసిన అవసరం వుంది. అందులో మాతృభాషలో మాట్లాడమనో లేక రాష్ట్ర భాష హిందీలో ప్రసంగించమనో కోరేవారు ఎక్కువ. ఈ కారణంగానే దక్షిణాఫ్రికాలోని భారతీయులలో నా స్నేహసంబంధాలు చక్కగా పన్నిహితంగా వుండేవి అందువల్లే గోఖలే గారు సైతం అక్కడ హిందూస్తానీలో మాట్లాడితే బాగుంటుందని నేను భావించాను. ఈ విషయంలో గోఖలే గారి అభిప్రాయం నాకు తెలుసు. వచ్చీరాని హిందీలోనే పని జరుపుకోవటం వారికి నచ్చేదికాదు అందువల్ల మరాఠీలో లేదా ఆంగ్లంలో మాట్లాడటం వారికి యిష్టం దక్షిణాఫ్రికాలో మరాఠీలో మాట్లాడటం వారికి ఎబ్బెట్టు అనిపించింది. ఒక వేళ మరాఠీలో మాట్లాడినా గుజరాతీయులకు ఉత్తర భారతీయులకు దానిని హిందూస్తానీలోకి తర్జుమా చేయవలసి వుంటుంది. అందువల్ల ఆంగ్లంలోనే ఎందుకు ప్రసంగించకూడదు? అదృష్టం కొద్దీ వారిని మరాఠీలోనే ప్రసంగింపచేయటానికి ఒప్పించగలిగే తర్కం నా వద్ద వున్నది. జోహాన్స్‌బర్గ్‌లో కొంకణ్ ప్రాంతపు మహమ్మదీయులు చాలా మంది వున్నారు. కొంతమంది మహారాష్ట్ర హిందువులూ వున్నారు. గోఖలే గారి మరాఠీ ప్రసంగం వినాలన్న కోరిక వారికుండేది. మరాఠీలో ప్రసంగించటానికి వారిని ప్రార్థించమని వారు నన్ను యిదివరకే కోరారు. నేను గోఖలేగారితో - మీరు మరాఠీలో ప్రసంగిస్తే ప్రజలు ఆనందిస్తారు. మీ ప్రసంగాన్ని హిందూస్తానీలోకి నేను తర్జుమా చేస్తాను" అని అన్నాను. నా మాటవిని గోఖలే పకపకా నవ్వారు. నీ హిందూస్తానీ భాషతో నాకు బాగా పరిచయం వున్నది. ఆ భాష నేర్చిన నీకు నా ధన్యవాదాలు. పైగా నా మరాఠీ ప్రసంగాన్ని హిందూస్తానీలోకి అనువదించాలని ఆశపడుతున్నావు, యింత మరాఠీ నీవెప్పుడు నేర్చావో చెప్పు కాస్త?" అని అన్నారు. “నా హిందూస్తానీని గురించి మీరేమన్నారో మరాఠీ పరిజ్ఞానాన్ని గురించి కూడా అంతే అనుకోండి. మరాఠీ భాషలో ఒక పదం కూడా నేను మాట్లాడలేను. కానీ నాకు తెలిసిన విషయాల గురించి మీరు