పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

297


తల్లిదండ్రుల సంతానమే. వారిలో చాలామంది హోటళ్ళలో వంటవారుగానో, వడ్డించేవారిగానే పనిచేస్తున్నారు. వారి సహాయ సహకారాలవల్లే యింతమందికి వంట తయారు చేయటం సాధ్యమైంది. భోజనంలో దాదాపు పదిహేను వంటకాలు వుండి వుంటాయి. దక్షిణాఫ్రికా వారికి యిది చాలా కొత్త అనుభవం ఇంతమంది భారతీయులు ఏకపంక్తిలో కూర్చొని భోజనం చేయటం. అది పూర్తి శాకాహార వంటకాలు కావటం మత్తు పదార్థాల మాట అసలు లేకపోవటం వంటివి చాలా మంది తెల్లవారికి క్రొత్త పైగా చివరి రెండు అనుభవాలు అందరికీ కొత్తగానే వున్నాయి

ఈ సమావేశంలో గోఖలే చేసిన ఉపన్యాసం మొత్తం దక్షిణాఫ్రికా పర్యటనలోనే దీర్ఘమైనది. అన్నిటికంటే మహత్తరమైనది. 45 నిముషాల పాటు వారు ప్రసంగించారు. ఆ ప్రసంగం తయారు చేసుకునేందుకు గోఖలే మమ్మల్ని కఠిన పరీక్షలకు గురి చేశారు. స్థానిక ప్రజల దృష్టికోణాన్ని అవహేళన చేయక మన ఆలోచనాసరళిని దానితో మేళవించి చూడటం, తన జీవితనియమమని గోఖలే గారు నాతో అన్నారు. అందువల్ల వారి ప్రపంగంలో ఎలాంటి విషయాలు వుండాలని నేను అకాంక్షిస్తున్నానో చెప్పమన్నారు. ఈ సంగతులన్నీ వ్రాసి యిమ్మని అడుగుతూ వాటిలోని అంశాలు తన ప్రసంగంలో ఏ ఒక్కటి కూడా లేకపోయినా నేను బాధపడనని మాట తీసుకున్నారు. దీనికి తోడు నా చిట్టా. అతి పెద్దదిగానూ అతి చిన్నది గానూ వుండకూడదు అయినా ముఖ్యమైన ఏ అంశమూ వదిలివేయకూడదు. ఇన్ని షరతులను పాటిస్తూ గోఖలేగారికి నా నోట్సు తయారు చేయవలసి పచ్చింది. నా భాషను వారే మాత్రమూ ఉపయోగించలేదనే చెప్పాలి. ఆంగ్ల భాషలో గొప్ప పాండిత్యం వున్న గోఖలే గారు నా భాషను ఉపయోగిస్తారని అసలెలా అనుకుంటాను. కానీ నా ఆలోచనలను పరిగణనలోకి తీసుకొనవచ్చునని వారు అనుకోవటం కూడా నా ఉద్దేశ్యాలను ఉపయోగించనట్లేనని నేను సమాధానపడ్డాను. వారి ప్రసంగ ధోరణి మా ఆలోచనలను ఉనయోగించారని గానీ, ఉపయోగించలేదని కాని తెలుసుకునే అవకాశం లేనిది. ఒక ఆలోచవను లేదా అంశాన్ని ఉటంకించకుంటే