పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

చరిత్ర


హబ్షీలు చాకిరీకి దొరికారు గనుల్లో పని చేయడం వల్ల వాళ్లను క్షయరోగం పట్టుకుంది. ఆజబ్బును అక్కడ మైనర్స్‌థైసిస్ అని అంటారు. యిది ప్రాణానికి ముప్పు తెచ్చే జబ్బు ఇట్టి జబ్బు గలవాళ్లు గనుల దగ్గర కుటుంబాలతో సహా వుంటారు. అక్కడ యీజాడ్యంతోబాటు యింకా ఎన్ని రోగాలు వ్యాప్తమయ్యాయో ఊహించలేము అరోగాలకు వాళ్లే బలిఆయిపోతూ వుండేవారు. దక్షిణాఫ్రికాలో వుంటున్న ఇంగ్లీషు వాళ్లుకూడా యీ గంభీరమైన సమస్యను పట్టించుకొని పరిష్కారానికై కృషి ప్రారంభించారు. చివరికి ఒక్క విషయం అందరికీ అర్ధమైందని భావిస్తున్నాను పాశ్చాత్య సభ్యతా ప్రభావం వల్ల ఉపయోగంకంటే హబ్షీలకు అపకారమే అత్యధికంగా జరిగిందనే విషయం సత్యం యిది కావాలంటే ప్రతివారూ చూడవచ్చు

ఇట్టి నిర్దోషులైన జాతివారిపై 400 సంవత్సరాలకు పూర్వం డచ్ వారికన్ను పడింది. దానితో అక్కడికి ప్రవేశంచి వాళ్లు డేరా వేశారు. కొంత మంది డచ్‌వారు తమ అధినివేశరాజ్యంగా వున్న జావానుంచి మలైజుతి బానిసల్ని తీసుకొని దక్షిణాఫ్రికా యందలి కేప్‌కాలనీ అనుచోటుకు వచ్చారు. మలైజాతి ప్రజలు మహమ్మదీయులు వారిలో డచ్‌వారి రక్తంతో పాటు, వారి గుణాలు కూడా కొన్ని చొరబడ్డాయి. వేరు వేరు ప్రదేశాలకు ప్రాకినా వారి ప్రధాన కేంద్రం కేప్‌టౌన్ నాత్రమే కొంతమంది మలై వాళ్లు తెల్లవాళ్ల దగ్గర చాకిరీ చేస్తున్నారు. కొందరు స్వతంత్ర వృత్తుల్ని చేపట్టారు. మలై స్త్రీలు బాగా శ్రమ పడతారు. తెలివిగలవాళ్లు కూడా వాళ్ల నడవడి శుభ్రంగా వుంటుంది మలై స్త్రీలు చాకలి పని, కుట్టుపని బాగాచేస్తారు. పురుషులు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. చాలామంది జట్కాలు, టాంగాలు తోలిసంపాదిస్తూ వుంటారు. కొంతమంది ఆంగ్లంలో ఉన్నత విద్య కూడా అభ్యసించారు వారిలో ఒకరు డా॥ అబ్దుల్ రహమాన్ వారు కేప్ టౌనులో సుప్రసిద్ధులు వారు కేప్‌టౌన్ అసెంబ్లీలో కూడా మెంబరు అయ్యారు. తరువాత క్రొత్త మార్పులు తెచ్చి ముఖ్య అసెంబ్లీకి వెళ్లకుండా యిట్టి వారిని ప్రభుత్వం ఆపివేసింది

డచ్ వాళ్లను గురించి చెబుతూ వుండగా మధ్యన మలై వారిని గురించిన