పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

13


వశం చేసుకున్నారంటే, వారిలో ఏదో గొప్ప శక్తి నిండి యున్నదని వాళ్ళభావం వాళ్ళకు విలువిద్య బాగా తెలుసు కాని ఇంగ్లీషు వాళ్లు వాళ్లధనస్సుల్ని, బాణాల్ని లాగివేశారు. తుపాకీని వాళ్లు ఎరుగరు. ఎన్నడూ ప్రయోగించ లేదు తుపాకీ ఎలా పని చేస్తుందో వాళ్లకు తెలియదు. అగ్గిపుల్ల అయినా వెలిగించనవసరం లేకుండా కేవలం వేలితో నొక్కగానే, అది ప్రేలడం, ఎదురుగా వున్న వారికి గుండు దెబ్బ తగలడం, వాడు నేల కూలటం అంత విచిత్రంగా వాళ్లకు తోస్తుంది. అందువల్ల తుపాకీని చూచినా, తుపాకీ పట్టుకున్న వాణ్ణి చూచినా హబ్షీలకు విపరీతమైన భయం వాళ్లు, వాళ్ల పూర్వీకులు తుపాకుల బీభత్సాన్ని చూచారు. ఎంతో మంది తమ వారిని తుపాకులు పొట్టనపెట్టు కున్నాయని వాళ్లకు తెలుసు. అయితే చాలామందికి దానివివరం తెలియదు

ఈ జాతిలో మెల్లమెల్లగా సభ్యత వ్యాప్తమవుతూ వున్నది. పాదరీలు ఏసుక్రీస్తు సందేశాన్ని వారికి బోధిస్తున్నారు. వాళ్లకోసం స్కూళ్లు తెరిచారు అక్షరాలు నేర్పుతున్నారు. వారి కృషివల్ల మంచి నడతగల హబ్షీలు తయారైనారు. వారితో బాటు అక్షరజ్ఞానం పొందని, సభ్యత అంటే ఏమిటో తెలియని కొందరు హబ్షీలు మోసగాళ్లు గాను, ప్రమాదకారులు గాను కూడా తయారైనారు. సభ్యత నేర్చిన హబ్షీలంతా త్రాగుడుకు అలవాటు పడ్డారు వారి శక్తివంతమైన శరీరంలోకి మద్యం ప్రవేశించగానే యిక వాళ్లు పిచ్చివాళ్లైపోయి ఏంచేస్తారో వారికే తెలియదు రెండు రెండు కలిపితే నాలుగు అవడం ఎంత నిజమో, సభ్యత పొందినవారి అవసరాలు పెరగడం కూడా అంతనిజమే హబ్షీల అవసరాలను పెంచడానికని, కష్టం విలువవారికి అర్థమయ్యేలా చేయడానికని. హబ్షీల మీద తలపన్ను, గుడిసెపన్ను వేశారు యిట్టి పన్నుల్ని వేయకపోతే హబ్షీలు తమ తమ పొలాల్లోనే పడుకుంటారు బంగారు గనుల్ని వజ్రపు గనుల్ని త్రవ్వడానికి ముందుకు రారు. వాళ్లు వచ్చి గనులు త్రవ్వకపోతే బంగారం, వజ్రాలు భూమిలోపలే పడి వుంటాయి యిట్టి పన్నులు విధించకపోతే పాశ్చాత్యులకి చాకిరీ చేయుటకు బానిసలు దొరకరు. ఆంగ్లేయుల యీ పాచిక అక్కడ బాగా పారింది. వేలసంఖ్యలో