పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

టాల్‌స్టాయ్ క్షేత్రం - 3


ధర్మమని మేము గుర్తించాము వారికోసం ఉదయపు ఆహారం, రాత్రి భోజనానికి ఏర్పాటు కూడా చేసేవాళ్ళం. వారికోసం రాత్రిపూట ఖీర్ మొదలైన పదార్థాలు కూడా చేయించేవాళ్ళం. మాంసాహారం వుండేదికాదు. అసలు ఎవ్వరూ మాంసాహారం కావాలని అడగలేదు. వారికి తోడు వుండాలని ఒక్కోసారి మేముకూడా సాయంత్రమే భోజనం చేసేవాళ్ళం సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయటం సాధారణ నియమం. ఒకరు సూర్యాస్తమయానికి ముందే భోజనం చేసి తయారైపోతున్నవారు మరి కొందరు సూర్యాస్తమయం తరవాత భోజనానికి ఉపక్రమించేవారు. ముస్లిమ్ యువకులు సైతం తమ ఉపవాసదినాలలో ఎవరికీ యిబ్బంది కలిగించే వాళ్ళు కాదు. కానీ ముస్లిములు కాని యువకులు భోజన విషయంలో తమ ముస్లిం సోదరులలాగా సంయమనం పాటించటం వల్ల ఆశ్రమవాసులపై చక్కటి ప్రభావం పడింది మతకారణంగా బాలుర మధ్య వివాదాలు చెలరేగిన సంఘటనలేవీ నాకు తెలియరాలేదు. తమ తమ మత ఆచారాలను బుద్ధిగా పాటిస్తూనే పరస్పరం అంతా ఆదరపూర్వకంగా వ్యవహరించే వాళ్ళు పైగా ధార్మిక వ్రత సమయాల్లో ఒకరికొకరు సాయంచేసుకునేవారు కూడా.

నగర జీవనానికి దూరంగా వుంటున్నాం ఆరోగ్య సదుపాయాలు సాధనాలు సైతం ఆశ్రమంలో మేము వుంచుకునే వాళ్ళం కాదు. పిల్లల నిర్దోషిత్వం గురించిన నమ్మకం లాగే అనారోగ్య సమయంలో ప్రకృతి వైద్యం గురించిన నమ్మకమూ అప్పట్లో నాకుండేది. సాదాసీదా జీవనం గడిపేవారికి అనారోగ్యాలు రావనీ ఒక వేళ వచ్చినా నేనే వైద్యం చేసుకోగలనవి నా గట్టి సమ్మకం. స్వస్థత గురించిన నా చిన్న పుస్తకం నా ప్రయోగాలకు అప్పటి నాశ్రద్ధకూ అద్దం పడుతుంది. నేనెప్పుడూ జబ్బుతో పడక వేయననీ, కేవలం నీరు, మట్టి, ఉపవాసం యిలాంటి ప్రయోగాలతో ఆహార మార్పిడితో అన్ని అనారోగ్యాలకు చికిత్స చేయవచ్చునని నా ప్రగాఢ విశ్వాసం. ఆశ్రమంలో ఏ వ్యక్తికి జబ్బు చేసినా వైద్యం చేయించటం గానీ మందులు వేయటం గానీ నేను చేయలేదు. ఆశ్రమంలో డెబ్బైఏళ్ళ ఉత్తర భారతానికి చెందిన వృద్ధుడొకాయన వుండేవారు. అతనికి ఉబ్బసమూ దగ్గు వుండేవి. ఇవి కూడా