పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

277

నేను చేసిన యీ పని ప్రభావం ఆశ్రమ వాసుల సంపూర్ణ జీవనం మీద పడింది. అతి తక్కువ ఖర్చుతో జీవితాన్ని గడపటమన్న లక్ష్యంతో దుస్తుల విషయంలో కూడా మార్పులు తీసుకుని వచ్చాం దక్షిణాఫ్రికాలోని భారతీయుల దుస్తులు యూరోప్ వాసుల వలె వుంటాయి. సత్యాగ్రహల దుస్తులు కూడా అలాగే వుండేవి. కాని టాల్‌స్టాయ్ ఆశ్రమంలో యీ వస్త్రాల అవసరం వుండేది కాదు. మేమంతా కూలీపని చేస్తున్నాం, కనుక కూలీల దుస్తులే మేము వేసుకోసాగాం అయితే విధానం మాత్రం యూరోపియన్లదే అంటే కూలీల లాగా పైజామా కమీజూ ఇందులో ఖైదీల దుస్తుల విధానాన్ని కూడా అనుకరించాం లావు బట్టతో కుట్టిన పైజామా, కమీజులు బజార్లో దొరికే వాటినే మేమంతా ఉపయోగించే వాళ్ళం. స్త్రీలలో చాలా మంది చక్కటి కుట్టుపని చేసేవాళ్ళు. వాళ్ళంతా యీ భారం వహించారు.

భోజనంలో సాధారణంగా అన్నం పప్పు, కూర, రొట్టె అప్పుడప్పుడూ వీటితో పాటు పాయసం వుండేవి. అన్నమంతా ఒకే గిన్నెలో వండబడేది. జైళ్ళలోలా పళ్ళానికి బదులు మట్టిప్లేటు వుండేది. చేతితో తయారుచేసిన చెక్క స్పూన్లు వుండేవి. రోజుకు మూడుసార్లు భోజవం, ప్రొద్దున ఆరింటికి డబుల్ రొట్టె, గోధుమకాఫీ 11 గంటలకు పప్పు అన్నం, కూర, సాయంత్రం 4 గంటలకు గంజి, పాలు లేదా డబుల్ రోటి, గోధుమ కాఫీ. రాత్రి 9 గంటలకు నియమం ప్రకారం అందరూ నిద్రించాలి. సాయంత్రం భోజనం తరువాత 7.30 మధ్య ప్రార్థన వుండేది. అందులో భజనలు పాడేవారు. అప్పుడప్పుడూ రామాయణం. ఇస్లామ్ గ్రంథాల నుంచి కొన్ని భాగాలు కూడా చదవబడేవి, భజనల్లో ఆంగ్లం, హిందీ గుజరాతీ మూడు భాషల్లోని రచనలూ వుండేవి మూడు భాషల్లోని భజనలూ ఒక్కోసారి ఒకే భాషలోనూ పాడేవారు.

ఆశ్రమంలో వుండేవారిలో ఎక్కువమంది ఏకాదశీ వ్రతం చేసుకునేవారు. ఉపవాసాల గురించి ఎక్కువ పరిజ్ఞానమున్న పి.కె. కొత్వాల్‌గారు అక్కడికి విచ్చేశారు. వారి పర్యవేక్షణలో మాలో కొందరు చాతుర్మాసం కూడా చేశాం. అదే రోజుల్లో మహమ్మదీయుల రోజులు కూడా వుండేవి. మా మధ్య ముస్లిం యువకులు వుండేవారు. వారిని రోజూ వుండేందుకు ప్రోత్సహించటం మా