పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

టాల్‌స్టాయ్ క్షేత్రం - 3


పొడవాటి జుట్టును నేను కత్తిరించేందుకు అనుమతించండని అడిగాను ఆశ్రమంలో మేము ఒకరికొకరం క్షవరం చేసుకోవటంలోనూ గడ్డం గీసుకోవటంలోనూ సాయం చేసుకునే వాళ్ళం అందువల్ల వెంట్రుకలు కత్తిరించే కత్తెరలు వంటి సామాను మా వద్ద వున్నది. ముందైతే ఆ అమ్మాయిలిద్దరూ తమ తల వెంట్రుకలు కత్తిరించేందుకు అనుమతించలేదు కొందరు వయసులో పెద్దవారైన స్త్రీలకు నా ఉద్దేశ్యం చెప్పి వారిని ఒప్పించాను ముందు వారు కూడా నా సూచనను అంగీకరించలేదు. కానీ దీని వెనుకనున్న నా ఆలోచనను వారు అంగీకరించి తమ అంగీకారం తెలిపారు. అమ్మాయిలు అందంగా ఆకర్షణీయంగా వున్నారు. అయితే వారిలో ఒకరు యీనాడు లేరు. ఆ అమ్మాయి ముఖంలో మంచి తేజస్సు వుండేది. రెండవ అమ్మాయి గృహిణి జీవితం గడుపుతోంది. చివరికి యిరువురూ తలవెంట్రుకలు కత్తిరించుకునేందుకు సన్నద్ధమయ్యారు యీ ప్రకరణం వ్రాస్తున్న చేతితోనే వాళ్ళ వెంట్రుకలను కత్తిరించేశాను. దీని తరువాత తరగతి గదిలో నేను చేసిన యీ పనిని విశ్లేషించి చెప్పి వాళ్ళను శాంతింప జేశాను. దీన పర్యవసానం మంచిగా వున్నది. తరువాత అమ్మాయిలను అబ్బాయిలు ఏడిపించడమన్న ఫిర్యాదు నేను వినలేదు. వాళ్ళిద్దరూ పోగొట్టుకున్నది ఏమీ లేదు కానీ పొందినది ఎంత వున్నదో భగవంతునికే తెలుసు ఆ యువకులు యిప్పటికీ యీ సంఘటనను గుర్తుంచుకుని తమ ప్రవర్తనను మార్చుకుని వుంటారని నా ఆశ

ఇలాంటి ప్రయోగాలను ఏ అధ్యాపకుడైనా అనుకరిస్తే ఆపదలను ఎదుర్కొన వలసి వస్తుంది. ఒక సందర్భంలో మనిషి ఎంతవరకు వెళ్ళగలడో తెలుపుతూ వత్యాగ్రహంలోని పరిశుద్ధతను సూచించటానికి యీ ప్రయోగాన్ని గురించి వ్రాశాను. ఈ పరిశుద్ధత వల్లే మా పత్యాగ్రహానికి విజయం సమకూరింది. ఇలాంటి ప్రయోగం చేసేందుకు అధ్యాపకుడే పిల్లల తల్లిదండ్రిగా వ్యవహరించవలసి వుంటుంది. ప్రాణాలను పణంగా పెట్టి యిలాంటి ప్రయోగాలు జరుగుతాయి. పైగా కఠోర తపస్సు యొక్క బలం యిందు అవసరం