పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

275


అంటిపెట్టుకునే వుండేవి. స్నానం చేసే వేళలు నిర్దిష్టంగా వుండేవి బాలబాలికలంతా ఒకేసారి స్నానానికి వెళ్ళటం జరిగేది. సామూహిక కార్యక్రమాలలో రక్షణ వుండటం వల్ల, అది యిక్కడా వుండేది. ఏకాంతం వారికి దొరికేదే కాదు. అప్పుడే సాధారణంగా నేనూ చెరువు దగ్గరకి చేరుకునే వాణ్ణి.

మేమంతా వరండాలో నిద్రపోయే వాళ్ళం. అమ్మాయిలు నా చుట్టుపక్కల పడుకునేవాళ్ళు. రెండు పడకలమధ్య మూడు అడుగుల దూరం దాదాపుగా వుండేది. పడకల క్రమంలో జాగ్రత్త వుండేది. కానీ కలుషితమైన మనసున్న వారి మధ్య జాగ్రత్త ఏలాంటిదైనా ఎంతవరకు పని చేస్తుంది? ఆ బాల బాలికల విషయంలో నా గౌరవాన్ని ఆ భగవంతుడే కాపాడాడనుకుంటాను బాలబాలికలంతా ఏదోష భావమూ లేకుండా కలిసి మెలిసి వుండగలరన్న విశ్వాసంతో సేవా ప్రయోగం అప్పట్లో చేయగలిగాను. వాళ్ళ తల్లిదండ్రులు నాపై వుంచిన అపారమైన విశ్వాసమే నన్ను యిలా ప్రేరేపించినదని చెప్పవచ్చు.

ఒకరోజు ఒక అబ్బాయి యిద్దరు అమ్మాయిలను ఆటపట్టించాడన్న విషయం ఆ అమ్మాయియో లేక వేరే అబ్బాయో వచ్చి నాకు చెప్పారు. నేను వణికిపోయాను దీనిపై విచారిస్తే నిజమేనని తెలిసింది. నేను ఆ అబ్బాయిని కోప్పడ్డాను. కానీ ఆ మాత్రం చాలదు. నేను ఆ అమ్మాయిల శరీరాలపై ఏదేని చిహ్నాలుంచాలనుకున్నాను. వాటిని చూచి యువకులలో వారిని దృష్టితో చూడకూడదన్న భావన కలగాలన్నది నా ఉద్దేశ్యం. ఈ చిహ్నాల వల్ల తమపై ఎవరూ ఆక్రమణ చేయటానికి సాహసించరని ఆ అమ్మాయిలు ధైర్యంగా వుండగలరని నా ఆలోచన. రాముడు సీతకు చాలా దూరంగా వున్నా రావణుడు సీతను సమీపించలేకపోయాడు. ఈ అమ్మాయిల్లో కూడా అలాంటి పవిత్రతా చిహ్నాలు వుంటే వారిని ఎవరూ కుదృష్టితో చూడరనీ, అలాంటి చిహ్నాలు నేను వారికివ్వగలిగితే బాగుంటుందని నా అభిలాష. ఈ ఆలోచనలతో నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. ప్రొద్దున్న ఆ అమ్మాయిలను బుజ్జగించే ప్రయత్నం చేశాను. వాళ్ళను ఆశ్చర్యపోనివ్వకుండా నెమ్మదిగా మీ