పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

చరిత్ర


పిండిగా విసిరి, దాన్ని నీటిలో ఉడకబెట్టి సంకటి తయారుచేసి దాన్ని భుజిస్తారు. ఎప్పుడైనా మాంసం దొరికితే, పచ్చిదాన్నో లేక వండినదాన్నో, ఉప్పువేసుకొని తింటారు. నిప్పుల మీద వేయించి కూడా తింటారు. ఏ మాంసాన్నైనా సరే తింటారు. ఏమాత్రం సంకోచించరు. వాళ్ల భాషల పేర్లు వాళ్ల జాతులపేరట వుంటాయి. తెల్ల వాళ్లు వచ్చిన తరువాతనే వ్రాత వ్యవహారం అక్కడ ప్రారంభమైంది. హబ్షీలకు అక్షరక్రమం అ, ఆ, క, ఖ, గ రూపంలో లేదు. హబ్షీల కోసం బైబిలు రోమన్ లిపిలో ప్రచురించారు జూలూ భాష మధురంగా వుంటుంది. వారి శబ్దాలకు అర్థం కావ్యత్వం రెండూ వుంటాయని చదివాను విన్నాను నేను నేర్చిన కొన్ని హాబ్షీ శబ్దాలవల్ల వారి భాషను గురించి పై నిర్ణయానికి వచ్చాను. పట్టణాల్లోను, అధినిదేశ రాజ్యాల్లోను వాడిన యూరోపియన్ పేర్లన్నింటికి మధురమైన హబ్షీ పేర్లు వున్నాయి. అవి జ్ఞాపకం లేనందున యిక్కడ వ్రాయలేదు. క్రైస్తవ పాదరీలు అభిప్రాయం ప్రకారం హబ్షీలకు మతమంటూ ఏమీ లేదు ఆధ్యాత్మికంగా ఆలోచించితే హబ్షీలు ఏవో ఒక అర్ధం కాని అలౌకికశక్తిని అంగీకరిస్తారని, దాన్ని పూజిస్తారని తేలుతుంది. ఆశక్తికి వాళ్లు భయపడతారు. శరీరం నాశనమైన తరువాత మనిషి పూర్తిగా నాశనం కాడని వాళ్ల విశ్వాసం నీతికి కట్టుబడి వుంటారు. కనుక వారిని ధార్మిక పురుషులుగా భావించవచ్చు నిజమేదో, అబద్ధమేదో వాళ్ళకు బాగా తెలుసు సామాన్యంగా హబ్షీలు సత్యాన్ని పాలిస్తూ వుంటారు పాశ్చాత్యులతో బాటు మనం కూడా ఆవిధంగా పాలిస్తున్నామనడం సందేహాస్పదమే వాళ్లకు దేవాలయాలుగాని, అటువంటి స్థలాలు గాని లేవు యితర జాతుల వారి వలెనే వారిలో కూడా అనేక మూఢనమ్మకాలు ప్రచలితమై వున్నాయి ఆశ్చర్యకరమైన విషయం ప్రపంచంలో ఏ జాతి వారికీ తీసిపోని యీ హబ్షీజాతి వారు పిరికిపందలు ఇంగ్లీషు పిల్లవాణ్ణి చూచినా భయపడిపోతారు. ఎవరైనా పిస్తోలు ఎక్కుబెట్టి చూపిస్తే చాలు హబ్షీ వాడు పారిపోతాడు. పారిపోలేకపోతే మూర్ఖునివలె నీరసపడి పోతాడు. దీనికి ఒక కారణం వున్నది. ఇంగ్లీషు వాళ్లు బహుకొద్ది మందే అట్టి కొద్దిమంది ఆంగ్లేయులు వచ్చి పెద్ద సంఖ్యలో వున్న తామందరినీ