పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

టాల్‌స్టాయ్ క్షేత్రం - 2


చెప్పక తప్పదు. జైలుకంటేయీ క్షేత్రమందలి పనులు మరింత కఠినమైనవనే చెప్పాలి. ఒకరోజైతే ఎండ అలసట వల్ల వారు స్పృహతప్పి క్రింద పడిపోయారు. కానీ వారు ఓడిపోయేమనిషి కాదు శరీరాన్ని పరీక్షా సాధనంగా భావించి ఇక్కడ తన పూర్తిగా నడుం కట్టి పని చేశాడు. చివరికి కండబలంలో అందరికీ సమానంగా దీటుగా తయారయ్యారు జోసెఫ్ రాయ్‌సేస్ మరో స్నేహితుడు వున్నాడు. బారిస్టరైనా, బారిష్టరునన్న గర్వం అతనికి వుండేది కాదు. కఠిన పరిశ్రమ చేయలేని శరీరం వారిది. రైల్లో నుంచి సామాను క్రిందికి దించటం, దాన్ని బండిలో పెట్టేయటం ఆయనకి కష్టం కలిగించే పనులు అయినా యధాశక్తి ఆ పని చేశారాయన టాల్‌స్టాయ్ క్షేత్రంలోకి వచ్చి నిర్భలులైన ప్రతివారూ బలవంతులయ్యారు. పరిశ్రమ అందరికీ శక్తి నివ్వగలదన్న మాట రుజువైంది.

క్షేత్రంలో వున్న వారు ఏదో ఒక పని మీద జోహాన్స్ బర్గ్ వెళ్లవలసి వచ్చేది పిల్లలక్కడికి వాహ్యాళికై వెళ్లటానికి యిష్టపడేవాళ్లు పనికి సంబంధించి జోహాన్స్‌బర్గ్ వెళ్లవలసి వచ్చేది. క్షేత్రానికి సంబంధించిన పనిమీద వెళ్ళే వాళ్ళకి రైల్లో అదీ మూడవ తరగతిలో మాత్రమే ప్రయాణించే అనుమతినివ్వాలని నిర్ణయించటం జరిగింది. వాహ్యాళి కోసం వెళ్ళే వాల్ళు నడిచి వెళ్ళవలసివుంటుంది. వారికి తినుబండారాలు కూడా యివ్వాల్సి వుంటుంది నగరానికి వెళ్ళి తినటానికి తాగటానికి డబ్బు ఖర్చు పెట్టరాదు. ఇలాంటి నియమాలు పెట్టకపోతే అడవిలో సైతం వుండటానికి సిద్ధమై డబ్బు పొదుపు చేయటానికి ఎందుకు సిద్ధపడ్డామో, ఆడబ్బంతా నగరం వెళ్ళి బజార్లలో తినే ఉపాహారానికై ఖర్చయిపోతుంది. ఇంట్లో తయారు చేయబడిన ఉపాహారం సాదాసీదాగా వుండేది. ఇంటి దగ్గరే పిండి కొట్టించి బరకగా వున్న పిండితో చేసిన డబుల్ రొట్టె. దానిపై వేరు సెనగ పప్పుతో చేసిన వెన్న యింటి నారింజ కాంతులతో చేసిన జామ్ యిదీ ఆ ఉపాహారం, వేరు సెనగ పప్పుతో తయారు చేసిన యీ వెన్న బైట పాలవెన్న కంటే నాలుగింతలు తక్కువ ధరకే వస్తుంది. నారింజలు క్షేత్రంలోనే ఎక్కువగా లభిస్తాయి. క్షేత్రంలో ఆవుపాలకన్నా బైట నుంచి వచ్చే డబ్బాపాలనే ఎక్కువగా ఉపయోగించే వాళ్ళం .