పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

267


సహాయంగా వుంటారు నేను వున్నాను చిన్న చిన్న తగాదాలు నా సమక్షంలో దూరమవుతాయి. భోజనం చాలా సాదాసీదాగా వుండాలని నిర్ణయించారు. భోజన సమయాలు నిర్ధారించబడ్డాయి. వంటిల్లు ఒకటే అందరూ ఒకే పంక్తిలో కూర్చుని భోజనం చేసేవారు తమ కంచాలు గ్లాసులు తామే శుభ్రం చేసుకొనవలసి వుండేది వంటింటిలోని సామను వంతులు వంతులుగా శుభ్రపరచటం జరిగేది. టాల్‌స్టాయ్ క్షేత్రం చాలా దినాలు నడిచినా సోదరీ సోదరులెవ్వరూ మాంసాహారం కావాలని ఆడుగలేదు. మద్యం పూర్తిగా నిషిద్ధం

ఇల్లు వూడ్చేందుకు కూడా వీలైనంత వరకు మనపని మనమే చేసుకోహలని మా కోరిక మా ముఖ్యుడు కైలనభైకీ నారాయణన్ దాస్ దామానియా అన్న గుజరాతీ వడ్రంగి ఒకరు. డబ్బు తీసుకోకుండానే రయీ పనిలో సాయం చేశారు. కూలి తక్కువ తీసుకునే యిద్దరు కూలీలను కూడా తెచ్చాడు. పనితనం అవసరం లేని సామాన్య కార్యకలాపాలు మేమంతా చేశాం. మాలో చక్కని ఆరోగ్యవంతులైతే అద్భుతాలు చేశారు. వడ్రంగి పనిలోని అర్థభాగం పనంతా మాలోని ఓ చక్కని సత్యాగ్రహం చేశారు. పరిశుభ్రం చేయటం నగరానికి వెళ్ళి అవసరమయ్యే వస్తువులను తెచ్చేపనంతా సింహంలాంటి నాయుడే చూసుకున్నాడు.

ప్రాగ్‌జీ ఖండుబాయి దేశాయ్ అన్న వ్యక్తి టాల్‌స్టాయ్ క్షేత్రంలో వుండేవాడు. ఆయనైతే జీవితంలో కష్టమంటే ఏమిటో తెలియని విధంగా పెరిగాడు. కానీ గడగడ వణికించే చలిని, సలసల కాల్చే ఎండలను ఆయన భరించవలసి వచ్చింది. కుండపోత వంటి వర్షపు ధాటిని సైతం తట్టుకొన వలసి వచ్చింది. మొదట్లో డేరాల్లో వుండవలసి వచ్చింది. ఇల్లు తయారు కావటానికి రెండు నెలల సమయం పట్టింది. టిన్నురేకులతో తయారు చేయబడిన యిళ్ళు. కొలిచి వుంచిన చెక్క కూడా దొరికేది. అందువల్ల కొలత బద్దతో వాటిని అవసరానికి తగినట్టు ముక్కలు చేయటం జరిగేది. కిటికీలు తలుపులు ఎక్కువ వుండేవి కావు. ఇన్ని కారణాలవల్ల కొద్ది సమయంలోనే చాలా యిళ్ళు నిలబెట్టగలిగాము. కానీ ప్రాగ్‌జీకైతే యిది పరీక్షా కాలమేనని