పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

టాల్‌స్టాయ్ క్షేత్రం - 2

స్త్రీలలో క్రైస్తవ ధర్మానికి చెందినవారు మాంసాహారపుటలవాట్లు కలిగినవారూ వున్నారు. యిచ్చట మాంసాహార భోజనం నిషేధిస్తే బాగుంటుందని కైలన్‌బేక్ నేనూ తలచాము మాంసాహారానికి బాల్యం నుంచే అలవాటు పడినవారినీ కష్టకాలంలో యిక్కడ నివసించేందుకు రానన్ను వారినీ కొన్ని రోజులు మాంసాహారాన్ని మానివేయమని ఎలా చెప్పటం? ఒకవేళ చెప్పలేక పోతే, వారి భోజనం ఖర్చు ఎంతో పెరుగుతుంది? గోమాంసం తినే అలవాటున్న వారికి గోమాంసమూ యివ్వాలా? చివరికి వంట గదులెన్నో విడివిడిగా నడపాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితిలో నా ధర్మమేమిటి? ఖర్చు నిమిత్తం డబ్బు యివ్వాల్సిన వాణ్ణి నేనై యుండి మాంసాహారాన్ని వీటిని సమర్థించవలసి వుంటుంది. ఒక వేళ మాంసాహారులకు ఆర్థిక సహాయం అందదని నియమం పెట్టానంటే యిక యీ సత్యాగహ్ర సమరం కేవలం శాకాహారుల సహాయంతోనే నడపాల్సి వుంటుంది. ఇది ఎలా సంభవం? భారత దేశానికి చెందిన అన్ని వర్గాలను సంఘటితంచేసి నడుపబడుతున్న సమరం యిది ఈ పరిస్థితుల్లో నాకు నా ధర్మమేమిటో స్పష్టంగా అర్థమైంది ఒకవేళ క్రైస్తవులు ముసల్మానులు గోమాంసాన్నికోరినా వారికి నేను యివ్వవలసి వుంటుంది. ఇక్కడికి వారు రావటాన్ని నేను ఆపలేను.

కానీ భగవంతుడు ఎప్పుడూ ప్రేమను కురిపిస్తూనే వుంటాడు. నేనెంతో సరళంగా నా సమస్యను క్రైస్తవ సహోదరుల ముందుంచాను. ముస్లిమ్ పెద్దలు శుద్ధ సాత్త్విక భోజనం తయారు చేసుకునే వంటగదిని నడుపమంటూ ఎప్పుడో అనుమతి యిచ్చేశారు. ఇప్పుడు వారి భర్తలు జైళ్ళలో వున్నారు అట్టి క్రైస్తవ సోదరీమణులతో మాట్లాడవలసివుంది. వారు సైతం శాకాహార భోజనం విషయంలో నాతో ఏకీభవించారు. సోదరీమణులతో యింత దగ్గరగా మాట్లాడే అవకాశం నాకు యిప్పుడే కలిగింది. ఇంటిని గురించిన అసౌకర్యం డబ్బు గురించిన సమస్య, నా భావాలను గురించిన వివరణ అన్నీ వారితో చెప్పాను. వారికి అంతగా కావాలంటే గోమాంసం నేను ఏర్పాటు చేయగలనని కూడా చెప్పాను. సోదరీమణులు మాంసం అక్కర్లేదని చెప్పారు. వంటింటి బాధ్యతంతా వారి పైనే వుంచాము. మాలో నుండి ఒకరిద్దర్ని వాళ్లకు