పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

265


యిల్లు వుంది. నీళ్ళకోసం రెండు బావులు ఒక చెరువు వున్నాయి. సమీపంలో ఉండే ఒక మైలు దూరంలోనే 'లాలే' అన్న రైల్వే స్టేషన్ వుంది. జోహాన్స్‌బర్గ్‌కు 21 మైళ్ళ దూరాన వుంది. ఇక్కడే యిళ్ళు నిర్మించి సత్యాగ్రహుల కుటుంబాలను వుంచటానికి మేము నిశ్చయించాం




34

టాల్‌స్టాయ్ క్షేత్రం 2

టాల్‌స్టాయ్ క్షేత్రంలో వేయి దాకా చెట్లువున్నాయి వాటిలో చాలావరకు నారింజ రేగు వృక్షాలు పళ్ళకాలంలో సత్యాగ్రహులు వారి కుటుంబాల వారు తినగలిగినన్ని తిన్నా యింకా పళ్ళు మిగిలిపోతాయి ఒక చిన్న చెరువు వుంది అది నివాస స్థానాలకు దాదాపు 500 గజాల దూరంలో వుంది. అందువల్ల కడవలు నింపి నీరు యిళ్ళకు తీసుకుని వెళ్ళాలంటే కష్టపడాల్సి వస్తుంది

ఇక్కడ నౌకర్లతో యింటికి సంబంధించిన పనులను కానీ, వ్యవసాయానికీ లేదా యిళ్ళు కట్టించే పనికి సంబంధించిన పనులు చేయించకూడదని మా నిర్ణయం మరుగుదొడ్లు శుభ్రపరచటం మొదలుకొని వంట పని వరకూ అన్ని పనులూ స్వయంగా చేసుకోవాలి కుటుంబాల విషయానికి వస్తే స్త్రీ పురుషులను విడివిడిగా వుంచాలని ముందే నిశ్చయించాము అందువల్ల స్త్రీ పురుషుల యిళ్ళు విడివిడిగా దూరందూరంగా కట్టించాలని నిర్ణయమైంది కైలన్‌బెక్ వుండేందుకు సైతం యిల్లు కట్టించవలసి వుంది. దానికి దగ్గరగా చెక్క పనికి, చెప్పులు కుట్టించే పనికి కార్ఖానా కూడా సిద్ధం చేయవలసి వుంది.

ఇక్కడ వుండేందుకు గుజరాతీ, మద్రాస్, ఆంధ్ర, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన భారతీయులు రాబోతున్నారు. వీరు హిందూ, ముస్లిమ్, ఫారసీ, క్రైస్తవ ధర్మాలకు చెందిన వారు నలభైమంది యువకులు, యిద్దరు ముగ్గురు వయోవృద్ధులు ఐదుమంది స్త్రీలు యిరవై ముప్పైమంది బాలలు వున్నారు వీరిలో నలుగురైదుగురు బాలికలు