పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

టాల్‌స్టాయ్ క్షేత్రం - 1


అవకాశమసలే వుండదు. ఇందువల్ల సామాజిక ధనాన్ని మిగల్చవచ్చు సత్యాగ్రహుల పరివారాలకు కొత్త నిరాడంబర జీవితాలు గడపటానికీ, అనేక మందితో కలిసిమెలిసి వుండేందుకు తగిన శిక్షణ లభిస్తుంది. ఈ వ్యవస్థవల్ల అనేక ప్రాంతాల అనేక ధర్మాలకు చెందిన భారతీయులంతా కలిసివుండే అవకాశమూ లభిస్తుంది.

కానీ దీనికి అనుకూలమైన స్థానం ఎక్కడినుంచి ఎలా ప్రాప్తిస్తుందన్నదే ప్రశ్న. నగరంలో వుండటమంటే పొయ్యిమీద నుంచి పెనం మీద పడటమే భోజనానికయ్యే నెల ఖర్చు. నగరంలో కేవలం యింటి అద్దెకీ యివ్వాల్సి వస్తుంది. నగరంలో వుంటూ నిరాడంబర జీవనం గడపాలంటే కుటుంబాలకు కష్టమే. ఇంతేకాక కుటుంబాలన్ని ఓ చోట కలిసి యేదైనా ఉపయోగకరమైన వృత్తి చేపట్టాలంటే తగిన చోటు లభించదు. అందుకని నగరానికి మరీ దూరంగానూ లేక మరీ దగ్గరగానూ లేని ప్రదేశమేదైనా ఎంపిక చేస్తే మంచిదని మేము నిశ్చయించుకున్నాము ఫినిక్స్ ఆశ్రమం వుండనే వుంది. ఇండియన్ ఓపినీయన్ అక్కడి నుంచే వెలువడుతున్నది. కొంత వ్యవసాయం కూడా అక్కడ జరుగుతున్నది. తక్కిన సదుపాయాలు సైతం ఫివిక్స్‌లో వున్నాయి. కానీ జోహాన్స్‌బర్గ్ నుండి ఫినిక్స్ 300 మైళ్ల దూరంలో వుంది పైగా ప్రయాణానికి ముప్పై గంటల సమయం పడుతుంది. ఇంత దూరం కుటుంబాలను తీసుకుని వెళ్లడం చాలా కష్టమైన ఖర్చుతో కూడుకున్న పని ఇంతే కాక సత్యాగ్రహుల కుటుంబాలు తమ యిల్లూ వాకిలీ వదులుకుని యింత దూరం వెళ్లేందుకు సిద్ధంగా లేవు. ఒకవేళ సిద్ధమైన వారినీ జైలునుంచి విడుదలయ్యే సత్యాగ్రహులనూ ఫినిక్స్ పంపేపని అసంభవమని తేలింది.

అందువల్ల కుటుంబాలను ట్రాన్స్‌వాల్‌లోనే పైగా జోహాన్స్‌బర్గ్‌కు దగ్గరగానే వుంచాలని నిర్ణయించాము. శ్రీ కైబన్ బెక్ గురించి ముందే నేను పరిచయం చేశాను. 1100 ఎకరాల భూమిని కొని ఒక్క పైసా తీసుకోకుండా సత్యాగ్రహుల ఉపయోగార్ధం యిచ్చివేశారాయన (30 మే 1910) ఆ భూమిలో దాదాపు వేయిదాకా పళ్ళ చెట్లున్నాయి. అయిదారు మంది వుండేందుకు వీలైన చిన్న