పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

263


తెలియదు. ఒక సంవత్సరమా అనేక సంవత్సరాలా. పత్యాగ్రహులకైతే రెండూ సమానమే పోరాడటమే వారి దృష్టిలో విజయం. పోరాడటమంటే అర్థం. జైలుకు వెళ్లటం లేదా దేశ బహిష్కరణను పొందటం అంతే ఈలోగా సంసారం సంగతేం కావాలి? ఎప్పుడూ జైలుకు వెళ్ళే వారికి ఉద్యోగం ఎవరిస్తారు? జైలునుంచి విడుదలైన తరువాత తానేం తినగలడు? సంసారానికేం పెట్టగలడు? ఎక్కడ వుండటం? ఇంటి అద్దె ఎవరిస్తారు? జీవన భృతి లేకపోతే సత్యాగ్రహి కూడా ఆందోళన చెందుతాడు గదా తానూ పస్తుండి, తన పరివారాన్నీ పస్తులుంచి సత్యాగ్రహం చేసేవారు ప్రపంచంలో ఎక్కువమంది వుండరు

జైళ్ళకు వెళ్ళే సత్యాగ్రహుల పరివారాల పోషణ కోసం ప్రతినెలా వారికి డబ్బుయిచ్చే వాళ్ళం వారి వారి అవసరాలను బట్టి డబ్బు యివ్వటం జరిగేది. చీమలకు మెతుకులు ఏనుగుకు మణుగుల కొద్దీ ఆహారం. అందరికీ ఒకేలా డబ్బు యివ్వటం కుదిరేపని కాదు. పదిమంది పిల్లలున్న వారినీ ముందూ వెనుకా ఎవరూ లేని బ్రహ్మచారినీ ఒకే శ్రేణిలో ఎలా వుంచగలం? అలాగని కేవలం బ్రహ్మచారులనే సత్యాగ్రహుల సైన్యంలో చేర్చుకోవటం అసాధ్యం, అప్పుడు ఏ సిద్ధాంతం ప్రకారం డబ్బులివ్వాలి? వాళ్ల కుటుంబాన్ని దృష్టిలో వుంచుకుని విశ్వాసముంచి వారు అడిగిన దానిలో చాలా వరకు తక్కువ చేసి ఖర్చుల నిమిత్తం యివ్వటం జరిగేది. ఇందులో మోసం చేసే అవకాశం బాగా వుండేది. మోసగాళ్ళు కొంతవరకు యీ పద్ధతిని దురుపయోగపరచారు. ఇతర పరిశుద్ధ మనస్కులైన వారు సైతం ఒక తరహా జీవన స్థాయిని నిలుపుకునేందుకు ఆర్థిక సహాయం గురించి ఆశించేవారు. ఇలా సత్యాగ్రహులకు వారి పరివారాలకు ఆర్థిక సహాయం చేస్తూ సమరాన్ని ముందుకు నడపటం అసంభవమని తెలుసుకున్నాను. ఇందులో అర్హత గలిగిన వ్యక్తి అన్యాయం కావటానికీ దుశ్చరిత్రుడైన వ్యక్తి తన కుసంస్కారంతో సఫలుడవటానికి అవకాశం వుండేది. అందరూ కలిసి పని చేయటం వల్ల యీ సమస్య ఒక విధంగా పరిష్కారమయ్యే అవకాశం వుంది. ఇందువల్ల ఏ కుటుంబానికి అన్యాయమయ్యే భయం వుండదు. పాఖండులకు