పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

టాల్‌స్టాయ్ క్షేత్రం - 1


వచ్చేటప్పుడు హింద్ స్వరాజ్ అను పుస్తకం వ్రాశాను. సత్యాగ్రహ వైశిష్ఠ్యం గురించి తెలియజెప్పటమే ఆ రచనోద్దేశ్యం సత్యాగ్రహ సాఫల్యంలో నిక్షిప్తమైవున్న నా శ్రద్ధకు సరైన కొలబద్ద ఆగ్రంధం అందువల్ల నా దృష్టిలో పోరాడే సత్యాగ్రహుల సంఖ్యకు యేరకమైన ప్రాముఖ్యతా లేదు

కానీ ఆర్థిక సంబంధమైన చింత నన్ను పీడిస్తూ వుండేది. డబ్బులేని కారణంగా, చాలా సమయం వరకూ యుద్ధాన్ని కొనసాగించటం కష్టమైనపని డబ్బు లేకుండా సమరం నడుస్తుంది. డబ్బువల్ల నిజమైన యుద్ధం కలుషితమవుతుంది సత్యాగ్రహులకూ ముముక్షువులకూ అవసరానికి మించిన సాధనాలు భగవంతుడెప్పుడూ యివ్వడని యిప్పుడు తెలిసినంత బాగా ఆరోజుల్లో నాకు తెలియదు. కానీ నేను ఆస్తికుణ్ణి భగవంతుడు అప్పుడూ నాకు తోడుగా వున్నాడు నా కష్టాలను దూరం చేశాడు. దక్షిణాఫ్రికా తీరంలో దిగి జాతిజనులకు మా ఓటమిని గుర్తించి తెలపవలసి వుండగా మరోవైపు భగవంతుడు నా ఆర్థిక యిబ్బందులను దూరం చేశాడు. కేప్‌టౌన్ దగ్గర దిగగానే ఇంగ్లాండు నుంచి రతన్ టాటా సత్యాగ్రహానికై 25 వేల రూపాయల విరాళం యిచ్చారని తంతి వచ్చింది. అప్పటి అవసరాలకు యీ మొత్తం చాలు మా పని ముందుకు సాగింది

ఇంత డబ్బు, లేదా యింతకన్నా యెక్కువ డబ్బుతో సైతం సత్యం, ఆత్మశుద్ధి ఆత్మబలం యొక్క సమరం ముందుకు నడువదు. ఇలాంటి యుద్దానికి సత్య సంపద యొక్క అవసరం ఎక్కువ యజమాని లేకపోతే మహలు శిధిలం అనిపించినట్లు, మనిషి దగ్గర ఎంత సంపదవున్నా శీలసంపద లేనిదే ఆ మనిషి శిధిలజీవిగా కనిపిస్తాడు

సత్యాగ్రహులు - సమరం ఎంత వరకు సాగుతుందో చెప్పలేమని గ్రహించారు. అటు జనరల్ బోధా, జనరల్ స్మట్స్ ఒక్క అంగుళమైనా కూడా వెనక్కి తగ్గమని ప్రతిజ్ఞ చేసి కూర్చున్నారు. ఇటు మరణ పర్యంతమూ పోరాడతామని సత్యాగ్రహులు ప్రతిజ్ఞ చేశారు. ఇది ఏనుగు చీమల మధ్య జరుగుతున్న యుద్ధం కాలిక్రింద అణచి ఏనుగు చీమలను పచ్చడి చేయగలదు సత్యాగ్రహం ఎన్ని రోజుల వరకు సాగుతుందో సత్యాగ్రహులకే