పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

261


యధాతధంగా లార్డ్ ఎంప్ట్‌హిల్ ముందుంచగలనన్న నమ్మకం వారి కంతగా వుందన్న మాట

ఇక్కడ నేనో అప్రస్తుత విషయం కూడా చెప్పాల్సి వుంది. నేను ఇంగ్లాండ్‌లో వున్న సమయంలో అనేక మంది భారతీయ తీవ్రవాదులతో మాట్లాడాను. వారి తర్కాలను ఖండించేందుకు దక్షిణాఫ్రికాలోని తీవ్రవాద భారతీయులను సమాధాన పరచేందుకు "హింద్ స్వరాజ్" అన్న పుస్తకాన్ని వ్రాశాను. 1909లో ఇంగ్లాండు నుండీ దక్షిణాఫ్రికాకు తిరుగు ప్రయాణం చేసేటప్పుడే ఆ పుస్తకాన్ని వ్రాశాను వెంటనే ఇండియన్ ఒపీనియన్‌లో ఇది ముద్రింప బడింది కూడా లార్డ్ ఎంప్ట్‌హిల్‌తో యీ గ్రంథంలోని సిద్ధాంతాలను గురించి చర్చించాను వారి పేరు ప్రతిష్టలను సహాయసహకారాలను నా పని కోసం దురుపయోగం చేస్తున్నట్లు వారికి అనిపించకూడదన్నదే నా ఆశయం ఈ విషయమైవారితో జరిగిన నా సంభాషణ నాకిప్పటికీ జ్ఞాపకం వుంది వారి యింట్లో ఎవరికో అనారోగ్యంగా వున్నా, నన్ను వారు కలిశారు హింద్ స్వరాజ్ లో వ్యక్తీకరించిన నా అభిప్రాయాలతో వారు ఏకీ భవించక పోయినా దక్షిణాఫ్రికాలో మా సమరంసాగిన చివరి దాకా మమ్మల్ని వారు పూర్తిగా సమర్ధిస్తూనే వున్నారు. వారితో చక్కని సంబంధం నాకు వుండేది.




33

టాల్‌స్టాయ్ క్షేత్రం - 1

ఇంగ్లాండు నుంచి యీసారి దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చిన ప్రతినిధి బృందం మంచి సమాచారాన్ని తీసుకుని రాలేదు. లార్డ్ ఎంప్ట్‌హిల్ చెప్పిన మాటలకెలాంటి అర్థాన్ని కల్పిస్తారోనన్న చింత నాకు లేదు. ఈ సత్యాగ్రహ సమరంలో చివరి దాకా ఎవరు నాతో వుండగలరో నేనెరుగుదును. ఇప్పుడు సత్యాగ్రహ విషయంలో నా అభిప్రాయాలు మరింత పరిపక్వత పొందాయి సత్యాగ్రహం యొక్క వ్యాపకత్వం అలౌకికత్వం గురించి నేను బాగా ఆర్థల చేసుకున్నాను అందుకే నేను ప్రశాంతంగా వున్నాను ఇంగ్లాండు నుంచి తిరిగి