పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

11


వుండేవారు యిప్పటికీ గ్రామాల్లో జనం ఆలాగేవున్నారు. వాళ్ళుతమ మర్మస్థలాల్ని చర్మంతో కప్పుకుంటారు. కొందరైతే ఆపని కూడా చేయరు అంతమాత్రాన వాళ్లకు తమ ఇంద్రియాలపై అదుపు వుండదని భావించకూడదు ఒక తెగవాళ్ళ అలవాటు ఒక విధంగా వుండి, మరో తెగవాళ్ళ అలవాటు అలా వుండకపోతే, మొదటి తెగవాళ్లు తమ అలవాటు మానుకోరు. ఒకరి నొకరు చూచుకొనుటకు కూడా వీళ్ళకు సమయం దొరకదు. ఒకనాడు శుకుడు నగ్నంగాస్నానం చేస్తున్న స్త్రీల మధ్యగా వెళ్లవలసి వచ్చింది. అయినా ఆయన మనస్సు గాని, ఆస్త్రీల మనస్సుగాని వికారానికి లోను కాలేదు అని భాగపతకారుడు వ్రాశాడు యిది నాకు అతిశయోక్తి యని అనిపించలేదు భారతదేశంలోయిలా జరిగితే యిప్పుడు జనం పూరుకుంటారా? వికారాలకు లోనుకాకుండా వుండగలరా అని ఎవరైనా అడిగితే అది మన పతనావస్థకు తార్కాణమని చెబుతాను మనం మనదృష్టితో హబ్షీవాళ్లు అడివిజాతి ప్రజలని భావిస్తుంటాం. నిజానికి వాళ్లు అట్టిస్థితిలో లేరు

హబ్షీస్త్రీలు పట్టణాలకు వస్తే కంఠం దగ్గరనుంచి మోకాళ్ళవరకు వస్త్రం ధరించి తీరాలని నియమంవున్నది ఆ స్త్రీలకు యిష్టం లేకపోయినా బట్టలు ధరించక తప్పదు. అందువల్ల దక్షిణాఫ్రికాలో యీ రకం దుస్తులకు గిరాకీ హెచ్చింది. యూరపు నుంచి అట్టి దుస్తులు విపరీతంగా అక్కడికి దిగుమతి అవుతున్నాయి. పురుషులు నడుంనుంచి మోకాళ్ల వరకు దుస్తులు ధరించి తీరాలి యూరపు నుంచి దిగే బట్టలు వాళ్లు ధరిస్తున్నారు. అవికట్టని వాళ్లు డ్రాయరు లాంటి బట్ట ధరిస్తారు. దక్షిణాఫ్రికా ప్రజలు వుపయోగించే బట్టంతా యూరపు నుంచే దిగుమతి అవుతున్నది

హబ్షీల ప్రధాన ఆహారం మొక్కజొన్న దొరికితే వాళ్లు మాంసం కూడా తింటారు. కారం మసాలాలంటే వాళ్లకు తెలియదు. అది అదృష్టమే మిర్చిమసాలాల వాసనగాని, పసుపురంగుగాని ఆహారంలో కనబడితే హబ్షీలు తినడానికి యిష్టపడరు. అడివిజాతి వారైతే అసలు అట్టి ఆహారాన్ని ముట్టరు ఉడకబెట్టిన మొక్క జొన్నలో కొద్దిగా పుప్పుకలిపి ఒక పౌండు మొక్కజొన్న ఆహారం తింటారు. ప్రతిజూలుజాతివాడి పనియిదే కొందరు మొక్కజొన్న