పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

రెండవ ప్రతినిధి సంఘం


యిరువురి మాటలను జనరల్ బోధా గారికి తప్పక వినిపించండి సంఖ్యలో మా సత్యాగ్రహులు తక్కువే అయినా మా ప్రతిజ్ఞను మేము పాటిస్తామని మా సహన శక్తి వారి హృదయాన్ని కరిగించి ఏషియాటికి చట్టాన్ని రద్దు చేసేలా చేయగలదన్న నమ్మకం మాకున్నదనీ వారికి తెలియజేయండి" .

లార్డ్ ఎంప్ట్‌హిల్ అన్నారు . నేను మిమ్మల్ని ఇక వదిలిపెడతానని భావించకండి నా మంచి తనాన్ని రక్షించుకోవలసిన అవసరం నాకూ వుంది ఒక పనిని చేతికి తీసుకున్న తరువాత ఆలా మధ్యలోనే తెల్లవారు వదిలి పెట్టరు. మీ సమరం పవిత్రమైనది న్యాయమైనది మంచి సాధనాల సమరం కొనసాగిస్తున్న మిమ్మల్ని నేనెలా వదిలి పెట్టగలను? కానీ నా స్థితి మీ కర్దమయ్యే వుంటుంది. ఈ దు:ఖాన్ని మీరు భరించాల్సిందే. అందుకే యిప్పటి పరిస్థితిలో ఏదైనా ఒప్పందం జరిగితే దాన్ని అంగీకరించమని సలహా యివ్వటం నా ధర్మంగా భావిస్తాను. కానీ దుఃఖాన్ని యింతగా సహిస్తూ కూడా మీ ప్రతిజ్ఞను నిలుపుకునేందుకు మరింత పెద్ద దు:ఖాన్ని సహించేందుకు సన్నద్ధమవుతున్న మిమ్మల్ని ఎలా ఆపగలను? దీనికి నేను మీకు అభినందనలు తెలపుతున్నాను. మీ కమిటీకి అధ్యక్షుడిగా నేను కొనసాగుతాను కూడా అలాగే యధాశక్తి మీకు సహాయం కూడా చేస్తాను కానీ ఒక్కటి, లార్డ్ సభలో నేను జూనియర్ సభ్యుణ్ణి మాత్రమేనని మీరు గుర్తుంచుకోవాలి నా ప్రభావం అంత ఎక్కువగా వుండకపోవచ్చును. అయినా సాధ్యమైనంత మేరకు నా ప్రభావాన్ని మీ కోసం వినియోగిస్తూనే వుంటాను. ఈ విషయంలో మీకే మాత్రమూ సందేహం అక్కరలేదు

ప్రోత్సాహకంగావున్న యీ మాటలతో మేము శాంతిని పొందాము

ఈ సంభాషణలోని ఓ తీయని సంగతిని బహుశా పాఠకులు గమనించి వుండకపోవచ్చు నాకు సేఠ్ హాజీ హబీజ్‌కూ మధ్య బేదాభిప్రాయం వున్నా మా మధ్య చక్కని సంబంధాలున్నాయి నా అభిప్రాయానికి పూర్తిగా భిన్నంగా వున్న తన భావాలను కూడా ఎలాంటి సంకోచమూ లేకుండా నా ద్వారానే లార్డ్ ఎంప్ట్‌హిల్‌కు ఆయన చెప్ప గలిగారంటే పరస్పరం మాలో మాకు ఎంతటి విశ్వాసం వుందో పాఠకులకు తెలిసి వుండాలి. వారి మాటలను