పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

దేశ బహిష్కరణ


వారు. ఇప్పుడు వారందరిని విడివిడిగా వుంచి అంతులేని కష్టాలకు గురిచేయటం మొదలెట్టారు. ట్రాన్స్‌వాల్‌ లో చిక్కటి మంచువర్షం పడేది ఉదయం పనులు చేసిచేసి ఖైదీల చేతులు కొంకర్లు పోయేవి. చలి కాలం వారికి కష్టకాలంగా వుండేది ఇలాంటి స్థితిలో కొంతమంది ఖైదీలను ఒక చిన్న జైల్లో వుంచారు. ఇతరులెపరైనా వారిని కలిసేందకు వెళ్ళె వీలు పుండేది కాదు. నాగప్పన్ స్వామి అన్న 118 ఏళ్ళ ఖైదీ వారిలో వుండేవాడు. జైలు నియమాలన్నీ చక్కగా పాటించేవాడు. తనకు అప్పగించిన పనులన్నీ మనస్ఫూర్తిగా చేసేవారు. తెల్లవారు ఝామున రోడ్డుపై పనిచేయించేందుకు అతణ్ణి పట్టుకెళ్ళే వాళ్ళు దీనితో అతనికి డబుల్ న్యు... ..యా వచ్చి జైలునుంచి విడుదలైన తరువాత జూలై 7, 1909 నాడు కన్నుమూశాడు ఆఖరి శ్వాసవరకు సత్యాగ్రహ సమరాన్ని స్తుతించాడని, అతని స్నేహితులు చెబుతారు జైలుకు ఎందుకు వచ్చానన్న పశ్చాత్తాపం అతనికి వుండేది కాదు దేశం కోసం ప్రాప్తించిన మృత్యువును సైతం ఆనందంగా కౌగలించుకున్నాడు మన దృష్టిలో నాగప్పన్ చదువుకోని వాడు అనుభవంమీద ఆంగ్ల భాషను మాట్లాడే వాడు కానీ విద్వాంసుల పంక్తిలో కూర్చోబెట్టగలిగే స్థాయి అతనికి లేదు. కానీ నాగప్పస్ ధైర్యం అతని దేశభక్తి శాంతి కాముకత. మృత్యు పర్యంతమూ అతనిలో నిలిచివున్న దృఢత్వాలను దృష్టిలో వుంచుకుని చూస్తే యింతకన్నా యింకేం కావాలి అని అనిపించదూ! పెద్ద పెద్ద విద్వాంసులు యీ ట్రాన్స్‌వాల్ సమరంలో పాలు పంచుకోకపోయినా అది ఆగలేదు కానీ నాగప్పన్ వంటి సైనికులు రాకపోతే యిది అలా కొనసాగివుండేదా?

జైల్లో విధించిన కఠిన శిక్షలవల్ల నాగప్పన్ ఎలా మృత్యువు వాతపడ్డాడో, అలాగే దేశ బహిష్కరణ వల్ల కష్టాలు పడి నారాయణ స్వామి మృత్యువు వాతపడ్డాడు. (16 అక్టోబర్ 1910) ఈ పరిణామాలవల్ల దేశం ఓడిపోవటం కాక, సుదృఢమైందని చెప్పగలను కేవలం బలహీనులైనవారే యీ సమరంనుంచి తప్పుకున్నారు. కానీ యీ బలహీనులు సైతం యధాశక్తి త్యాగం చేశారు అందువల్లే బలహీనులని వారిని అవహేళన చేయయకూడదు ముందుకు వెళ్ళే వాళ్ళు వెనుక పడ్డ వారిని ఎగతాళి చేయటం, తమని వీరులుగా