పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

చరిత్ర


వుంటారు. అలాంటి ప్రయత్నాలేమీ చేయకుండానే జూలూ జాతివారికి బలిష్టమైన అవయవాలు, సౌష్టవమైన శరీరం సహజంగానే లభించాయని చెప్పవచ్చు. భూమధ్య రేఖకు సమీపంలో వుండే వారి శరీరం నల్లగా వుంటుంది. యిది ప్రకృతినియమం ప్రకృతి తీర్చిదిచ్చిన శరీరాలు. ఆకారాలు అన్నీ సహజంగా అందమైనవేనని మనం అంగీకారానికి వస్తే, సౌందర్యాన్ని గురించి మనం భావించే భావాలనుంచి విముక్తులమవుతాం అంతేగాక భారత దేశంలో నివసిస్తున్నమన శరీరంకొద్దిగా నల్లగా వుంటే సిగ్గుతో క్రుంగిపోతూ వుంటాం అసహ్యించుకుంటూ వుంటాం యిట్టి భావాలనుంచి కూడా మనం బయటపడతాం

ఈ హబ్షీలు మట్టితోను. గడ్డితోను నిర్మించిన గుండ్రని గుడిసెల్లో వుంటారు. ప్రతిగుడిసెకు మట్టిగోడ గుండ్రంగా నిర్మించబడుతుంది. దాని పైభాగం గడ్డితో కప్పబడుతుంది మధ్యలో నిలబెట్టబడిన స్తంభంపై పైకప్పు ఆధారపడి వుంటుంది. ఒక చిన్న ద్వారం అమర్చి వుంటుంది. వంగి జనంలోనికి వెళ్ళి వస్తూ వుంటారు. యీ ద్వారమే గాలియొక్క రాక పోకలకు సాధనం యిందు కిటికీలు వుండపు మనవాళ్ల మాదిరిగానే హబ్షీలు కూడా మట్టిగోడల్ని పేడతోను మట్టితోను అలుకుతారు. వాళ్లు నాలుగు పలకల వస్తువు నిర్మించలేరని, అందువల్లనే గుండ్రని వస్తువులు నిర్మిస్తారని బోధపడుతుంది. అటువంటి శిక్షణయే వారికి లభించిందన్నమాట ప్రకృతిబడిలో పెరిగిన యీ నిర్దోషులగు మనుజుల జ్ఞానం, ప్రకృతిరీత్యా తమకు కలిగిన అనుభవం మీద ఆధారపడివుంటుంది

ఇట్టి మట్టి మేడలో సామాను కూడా అందుకు తగినట్లే వుంటుంది పాశ్చాత్య సభ్యత యిప్పుడు దక్షిణాఫ్రికాలో వ్యాప్తమై పోయింది. అంతకు పూర్వం హబ్షీవాళ్లు చర్మం దుస్తులు ధరించేవారు. పదుకోడానికి కూడా చర్మాల్నే ఉపయోగించేవారు. కుర్చీలు, టేబుళ్లు, పెట్టెలు వగైరాలు వారి గుడిసెల్లో వుండేవి కావు యిప్పుడు కూడా చాలా వరకు యిదే స్థితి యిండ్లలో యిప్పుడు కంబళ్లను వాడుతున్నారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలనకు పూర్వం హబ్షీజాతి స్త్రీ పురుషులు దరిదాపుగా నగ్నంగా తిరుగుతూ