పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

9


నివసిస్తున్న హబ్షీల జనాభా తక్కువేనని చెప్పవచ్చు. అంతకంటే 20 లేక 30 రెట్ల మంది జనం వచ్చి వుండుటకు వీలైన విశాలమైన దేశం దక్షిణాఫ్రికా రైలు మీద డర్బన్ నుంచి కేఫ్‌టౌను వెళ్లుటకు సుమారు 1800 మైళ్ల దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది

సముద్రమార్గాన వెళ్లితే 1000 మైళ్ల దూరం వుంటుంది. మొదటి ప్రకరణంలో పేర్కొన్న నాలుగు అధినివేశ రాజ్యాల వైశాల్యం 473000 చదరపు మైళ్ళు

ఇంతపెద్ద భూభాగం మీద 1914లో హబ్షీల జనాభా 50 లక్షలు వుంటే తెల్లవారి జనసంఖ్య 13లక్షలు వున్నది. జూలూజాతి హబ్షీలు బలంగాను, అందంగాను వుంటారు. అందం అను విశేషణాన్ని హబ్షీల విషయంలో కావాలనే ప్రయోగించాను ఎర్రగావున్న చర్మాన్ని, కొటేరు ముక్కును అందానికి లక్షణాలని భావిస్తాం యిది ఆంధ విశ్వాసమే దాన్ని మరిచిపోతే జూలూజాతి వారిని సృష్టించునప్పుడు బ్రహ్మఏమీలోటు చేయలేదని చెప్పవచ్చు స్త్రీలు పురుషులు బాగా ఎత్తుగా వుంటారు. విశాలమైన ఛాతీ కలిగి వుంటారు వారి శరీరమందలి కండరాలు తీర్చిదిద్దినట్లు వుంటాయి బలంగా వుంటారు వారి పిక్కలు, బుజాలు మాంసపు కండలతో నిర్మించినట్లు వుంటాయి ఒక్కస్త్రీ గాని, పురుషుడుగాని, వంగి నడవరు. గూనితో నడవరు వారి పెదవులు మాత్రం పెద్దవిగాను, లావుగాను వుంటాయి. అయితే అవి మిగతా శరీరపరిమాణానికి అనువుగానే వుంటాయి. అందువల్ల వాళ్ల ఒడ్డుపొడవును నేను సమర్థిస్తాను వాళ్లకండ్లు గుండ్రంగా తేజస్సుతో నిండి వుంటాయి చప్పిడిముక్కు పెద్ద ముఖానికి సరిపోయేలా వుంటుంది. ఉంగరాల జుట్టు అవి వాళ్ళనిగనిగలాడే నల్లని శరీరం మీద అందంగా అమరివుంటుంది జూలూ తెగవారిని పలకరించి ఏమండీ మీ దక్షిణాఫ్రికాలో వుండే జాతులహరిలో అందమైన వారెవరని అడిగితే, వాళ్లు వెంటనే మేము అని సమాధానం చెబుతారు. వాళ్ల మాటను నేను కాదనలేను యిప్పుడు మనం ప్రపంచంలో ఎంతోమంది శాండోలను చూస్తున్నాం అనేకమంది వస్తాదులను చూస్తున్నాం, వాళ్లు తమ శిష్యుల శరీరనిర్మాణానికై ఎన్నో ప్రయత్నాలు చేస్తూ