పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

239


పరీక్షల్లో ఉత్తీర్ణులవుతూ వున్నారు మా కాలంలో బారిష్టరు పరీక్ష యిప్పటితో పోలిస్తే తేలికైనదే ఇప్పుడు బారిష్టరు చదివే వారు అప్పటికంటే చాలా ఎక్కువగా చదవాల్సి వుంటుంది కానీ సోరాబ్జీ ఎక్కడా ఓటమి నంగీకరించలేదు ఇంగ్లాండులో అంబులెన్స్‌కోర్ ప్రారంభించబడినప్పుడు దాని ప్రారంభకులలో ఒకరుగా ఆయన వున్నారు. చివరిదాకా దానిలోనే వున్నారు కూడా అదళం కూడా సత్యాగ్రహంలో పాల్గొనవలసి వచ్చింది. చాలా మంది దానిలో వెనక బడ్డారు. కానీ దానిలో స్థిరంగా నిలబడిన వారిలో అందరికంటే ముందు సోరాబ్జీయే వున్నారు. ఆ అంబులెన్స్ దళానికే సత్యాగ్రహంలోనూ విజయం లభించినదని ఎక్కడ చెప్పడం అవసరం

ఇంగ్లాండులో బారిష్టరీ అయిపోయిన తరువాత సోరాబ్జీ జోహాన్స్‌బర్గ్ తిరిగి వచ్చారు. అక్కడ వారు చేశసేవతోపాటు వకాల్తా కూడా ప్రారంభించారు దక్షిణాఫ్రికా నుంచి నాకు వచ్చే ఉత్తరాలలో సోరాబ్జీ ప్రశంస వుండేది ఆయన యెంత సాదాసీదాగా వుండేవారో యిప్పుడూ అలాగే వున్నారు. ఆడంబరమన్నది వారిలో మచ్చుకైనా లేదు. చిన్నా పెద్ద అందరితో ఆయనెంతో చక్కగా కలిసిపోగలరు అని మిత్రులు వ్రాసేవారు. కానీ భగవంతుడెంత కరుణామయుడో అంత నిర్ణయుడని కూడా అనిపిస్తుంది. సోరాబ్జీకి తీవ్ర క్షయ రోగం అంటింది. కొన్ని రోజులకే జాతి ప్రేమను పొంది, దాన్ని శోక సముద్రంలో ముంచి, సోరాబ్జీ చనిపోయారు యిలా కొద్ది సమయంలోనే భగవంతుడు యిద్దరు పురుషరత్నాలను లాక్కుని వెళ్ళాడు ఒకరు కాఛలియాసేర్, రెండువారు సోరాబ్జీ

ఇరువురిలో ఒకరిని ఎన్నుకొమ్మంటే ప్రధమ స్థానం ఎవరికి యివ్వాలి? ఇరువురూ తమతమ పనుల్లో అద్వితీయులే కాఛలియా ఎంత పవిత్ర మహ్మదీయుడో అంతే పవిత్ర భారతీయుడుకూడా అలాగే సొరాబ్జీ ఎంత గొప్ప పరాసీకుడో అంత గొప్ప భాఢతీయుడు కూడా

సోరాబ్జీ ముందు ప్రభుత్వానికి నోటీసు యిచ్చి పరీక్షార్ధం ట్రాన్స్‌వాల్‌లో అడుగుపెట్టాడు. ప్రభుత్వం దీనికే మాత్రమూ తయారుగా లేదు. అందు