పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

సోరాబ్జీ ఫాపుర్జీ అడాజణియా


పరిజ్ఞానం ద్వారా, సమరానికి సంబంధించి వారు యిచ్చే సలహాల నందరూ వినవలసి వచ్చేది. వారి సలహాలలో ఎప్పుడూ దృఢత్వం, వివేకం, ఉదారత శాంతి మొదలైన విశిష్ట లక్షణాలు దర్శనమిచ్చేవి త్వరగా వారో నిర్ణయానికి వచ్చేవారు కాదు ఓసారి ఓ సిద్ధాంతాన్ని నమ్మటం మొదలెడితే యిక దాన్ని వదిలి పెట్టే వారు కారు. వారిలో పారసీధర్మానుసరణం ఎంత వున్నదో భారతీయత కూడా అంతే వున్నది. సంకుచిత జాత్యభిమానపు దుర్గంధం మచ్చుకైనా వారిలో వుండేది కాదు సత్యాగ్రహ సమరం పూర్తయిన తరువాత మంచి సత్యాగ్రహుల నొకరిని ఇంగ్లాండ్ పంపి బారిష్టరీ చదివించేందుకై డాక్టర్ మెహతా స్కాలర్ షిప్ యిస్తానని ప్రకటించారు. అలాంటి యువకుల్లో నేనే ఎన్నుకొనవలసి వుంది ఇంగ్లాండ్ పంపే యోగ్యతలున్న యిద్దరు ముగ్గురు భారతీయులు వున్నారు. కానీ ఆలోచనల్లో ధృఢత్వం అర్ధం చేసుకోవటం లోని పరిపూర్ణతలో సోరాబ్జీని మించిన వారెవరూ లేరని మా మిత్రులందరికీ అనిపించింది. అందువల్ల వారినే ఎన్నుకోవటం జరిగింది. ఇలాంటి ఓ భారతీయుణ్ణి ఎన్నుకోవాలనుకునేందుకు కారణం అతడు బారిష్టరీ చదివి, దక్షణాఫ్రికా చేరుకొని నా స్థానాన్ని పూరించి జాతికి సేవ చేయగలగాలి భారతీయుల ఆశీర్వాదం, వారి గౌరవాలను అందుకొని. సోరాబ్జీ ఇంగ్లాండ్ వెళ్ళి బారిష్టరయ్యారు. దక్షిణాఫ్రికాలోనే గోఖలేతో వారికి పరిచయమైంది ఇంగ్లాండులో గోణులేగారి మనస్సును దోచుకున్నారు. హిందూదేశానికి తిరిగి వచ్చినపుడు భారత సేవక్ సమాజ్‌లో చేరమని సోరాబ్‌జీని గోఖలే కోరారు కూడా తనతోటి విద్యార్థులకు సోరబ్జీ అత్యంత ప్రీతి పాత్రులయ్యారు ప్రతి విద్యార్థి దుఃఖంలోను వారు పాలుపంచుకునేవారు. ఇంగ్లాండ్ యొక్క పైపై తళుకుల, వైభవాల ప్రభావం వారిమీద ఎంత మాత్రమూ పడలేదు ఇంగ్లాండుకు వెళ్ళినపుడు వారి వయసు ముప్పైకి పైగా వుంది. ఆంగ్లంలో వారికిది గొప్ప విద్వత్తు లేదు వ్యాకరణ పరిజ్ఞానానికి కొంత ధూళి అంటింది కానీ ఓ పనిమీద మనం మనసు లగ్నం చేస్తే యిలాంటి అడ్డంకులు మనల్ని ఏమీ చేయలేవు నిజమైన విద్యార్ధిగా జీవితం గడిపి సోరాబ్జీ తమ