పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

237


ఒక భాషాజ్ఞానం వుండాలన్న నియమం విధించబడింది. అందువల్ల ఆంగ్లభాషతో పరిచయం వుండి. ఇదివరకు ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించని ఒక భారతీయుణ్ణి గుర్తించే నిర్ణయం సమితి తీసుకున్నది. కొంతమంది భారతీయ యువకులను యీ సందర్భంగా ఫిలిపించటం జరిగింది. కానీ వారిలో సోరాబ్జీ ఫాపుర్జీ అడాజణియాను ఎన్నుకున్నారు. పేరును బట్టే సోరాబ్జీని పారసీకునిగా పాఠకులు గుర్తించి వుంటారు. దక్షిణాఫ్రికా మొత్తమ్మీద పారసీకుల జనసంఖ్య వందకంటే ఎక్కువ వుండి వుండదు. భారతదేశంలో వున్నప్పుడు పారసీకుల గురించి వున్న అభిప్రాయమే దక్షిణాఫ్రికాలో పున్నప్పుడూ నాకు వున్నది. ప్రపంచం మొత్తం మీద లక్ష కంటే ఎక్కువ పారసీకులు వుండకపోవచ్చు. ఇంత చిన్న జాతి అయివుండి కూడా తన ప్రతిష్టను కాపాడుకుంటూ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ వస్తున్నదీ జూతి పైగా ఉదారత్వంలో మరే జాతి దీనికి సాటిరాదు. ఈ జాతి ఔన్నత్యానికి యింతకంటే ప్రమాణాలు అవసరం లేదు. సోరాబ్జీ అనుభవం మీద స్వచ్ఛమైన రత్నంగా తనను తాను నిరూపించుకొనగలిగారు. సత్యాగ్రహ యుద్ధంలో ప్రవేశించినప్పుడు వారిని గురించి నాకు చాలా తక్కువగా తెలుసు సమరంలో ప్రవేశించిన తరువాత వారు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల చక్కని ప్రభావం నా పై బాగా వడింది. పారసీకుల సుగుణాలను నేనెంత అభిమానిస్తానో ఒక దేశవాసునిగా వారి లోపాలను గురించి కూడా నేను తెలుసుకుంటాను అందువల్ల సమర సమయంలో వారు నిలబడగలరా అని నాకు అనుమానంగా వుండేది. కానీ ఎదుటిమనిషి నా అనుమానానికి విరుద్ధంగా మాట్లాడితే ఇక నా అనుమానాన్ని వదిలివేయాలన్నది నా నియమం అందువల్ల సోరాబ్జీ తన లేఖల్లో దృఢ నిశ్చయాన్ని వెలువరించిన పద్ధతిని బట్టి అతనినే యీ పనికై ఎన్నుకొన వచ్చునన్న నా అభిప్రాయాన్ని సమితికి తెలియజేశాను. చివరికీ సొరాబ్జీ ప్రధమశ్రేణి సత్యాగ్రహిగా తనను తాను నిరూపించుకున్నారు. ఎక్కువకాలం జైలుశిక్ష అనుభవించే సత్యాగ్రహుల్లో ఆయనా ఒకరు అంతేకాక, సత్యాగ్రహ సమరాన్ని గురించి వారికున్న లోతైన