పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

సోరాబ్జీ షొపుర్జీ అడాజణియా


వస్తుంది దీనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం జరుగుతున్న సమయంలో మన విరోధలెవరైనా కొత్త అడ్డంకులు కలుగజేస్తే, అని సహజంగా సత్యాగ్రహంలో కలిసిపోతాయి. సత్యాగ్రహులు తమ మార్గంలో పయనిస్తుండగా మార్గంలో వచ్చే కష్టాలను ఉపేక్షించలేదు. ఎందుకంటే సత్యాగ్రహానికి విరుద్దంగా మరో సత్యాగ్రహం జరపడం సంభవం కాదు. అందువల్ల తక్కువ. ఎక్కువల సమస్యే దానిని భయపెట్టాలనుకుంటే భయపెట్టవచ్చు కానీ సత్యాగ్రహి అన్ని రకాల భయాలను త్యజిస్తాడు అందువల్ల విరోధి కొత్త యిబ్బందులను కలిగించనప్పుడు సైతం సత్యాగ్రహమంత్రాన్నే అతడు పరిస్తాడు. మార్గ మధ్యంలో ఎదురయ్యే సంకటాలను దూరం చేయుటకు. యీ మంత్రమే పనిచేస్తుందని పూర్తిగా విశ్వసిస్తాడు. అందువల్ల సత్యాగ్రహమెంత సుదీర్ఘంగా జరిగినా విరోధి దానినెంతగా సాగదీసినా, విరోధికి నష్టం వాటిల్లుతుంది సత్యాగ్రహికి ఎంతో లాభం చేకూరుతుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన యితర ఉదాహరణలు యీ చరిత్రలోనే ముందు ముందు మనం చూడగలం ఈ విషయాలన్ని భారతీయులకు అర్థమయ్యేలా వివరించాను



29

సోరాబ్జీ ఫాపుర్జీ అడాజణియా

ఇమిగ్రేషన్ ఆక్ట్ (వలస చట్టం) విషయాన్నీ సత్యాగ్రహ సమరంలో కలిపివేయటం వల్ల విద్యాధికులైన భారతీయులు ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించే అధికారానికి సంబంధించిన ఆటంకాన్ని ఎదుర్కోవలసిన అవసరం సత్యాగ్రహులకి ఏర్పడింది. ఏ భారతీయుని ద్వారానైనా సరే యీ పని సాధించాలని సత్యాగ్రహ సమితి నిర్ణయించింది వలస చట్టంలో ప్రతిబంధకానికి సబంధించిన వ్యతిరేకత లేని యితర షరతులను పాటించే ఒక భారతీయుణ్ణి ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశింపజేసి జైల్లో కూర్చోబెట్టేలా చేయాలి ఒక గౌరవ ప్రదమైన ధర్మాన్ని నిరూపించవలసిన అవసరం కలిగింది వలసచట్టంలోని ఒక అంశంలో ట్రాన్స్‌వాల్‌లో కొత్తగా ప్రవేశించే వ్యక్తికి యూరప్‌కి చెందిన