పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

భూగోళము


ప్రభుత్వం నియమించి వారి దగ్గరికి పంపుతుంది. ప్రభుత్వమే అక్కడ రైతులకు సహకరించుటకు వ్యవసాయ కేంద్రాల్ని నడుపుతుంది. రైతులకు మంచి పశువుల్ని, మంచి విత్తనాల్ని అందజేస్తుంది. కొద్ది ఖర్చుతో పాతాళ బావులు త్రవ్విస్తుంది వాయిదా పద్ధతిన అందుకైన వ్యయం చెల్లించుటకు వెసులు బాటు రైతులకు కల్పిస్తుంది. పొలాల చుట్టూ ఇసుప కంచెల్ని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకుంటుంది

దక్షిణాఫ్రికా భూమధ్యరేఖకు దక్షిణాన వున్నది. భారతదేశం ఆరేఖకు ఉత్తరాన వున్నది. అందువల్ల వాతావరణం, శీతోష్ణస్థితి రెండు దేశాల్లో వేరువేరుగా వుంటుంది. అంతా తలక్రిందుల వ్యవహారమే ఋతువులూ అంతే. ఉదాహరణకు మనదేశంలో వేసవికాలం ప్రారంభమైతే, దక్షిణాఫ్రికాలో శీతాకాలం ప్రారంభమవుతుంది. వర్షాకాలానికి నిశ్చితసమయమంటూ అక్కడ వుండచు ఏసమయంలోనైనా అక్కడ వర్షాలు కురవచ్చు. సామాన్యంగా 20 అంగుళాల కంటే మించి అక్కడ వర్షపాతం వుండదు



చరిత్ర

ఆఫ్రికా యొక్క భూగోళాన్ని వివరిస్తూ గతప్రకరణంలో నేను క్లుప్తంగా వర్ణించిన భూగోళ విశేషాలు ప్రాచీన కాలం నుంచి అక్కడ అమలులో వున్నాయని పాటకులు భావించకూడదు అతిప్రాచీన కాలంనుంచి దక్షిణాఫ్రికాలో ఎవరు నివసిస్తూ వుండేవారో యింతవరకు తేలలేదు యూరపియన్లు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ హబ్షీవాళ్లు వున్నారు అమెరికాలో బానిసత్వం తాండవం చేస్తున్నప్పుడు అమెరికా నుంచి పారిపోయి కొద్దిమంది హబ్షీలు దక్షిణాఫ్రికా వచ్చి వుండిపోయారని కొందరి అభిప్రాయం వాళ్లలో జూలూలు, స్వాజీలు బసూటోలు, బెక్వానాలు మొదలుగాగల వేరువేరు తెగల వాళ్లు వుండేవారు. యీ హబ్షీలే దక్షిణాఫ్రికా మూలనివాసులని చాలా మంది అంటున్నారు. అయితే దక్షిణాఫ్రికా చాలా విశాలమైన దేశం. అక్కడ