పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

7


టేబల్ మౌంటెన్స్ అను మెరకపల్లాలు లేని పర్వతచరియల్లో నిర్మితమై ప్రజల్ని బాగా ఆకర్షిస్తూ వుంటుంది. దక్షిణాఫ్రికాను పూజిస్తూ వుండే ఒక విదుషీమణి ఆ పర్వతాన్ని గురించి వర్ణిస్తూ తన కవితలో నేను అలౌకికమైన అనుభూతిని ఆపర్వత చరియల్లో పొందాను. అట్టి అనుభూతి మరే చరియల్లోను పొందలేదు అని వ్రాసింది. యిది అతిశయోక్తి అని నా అభిప్రాయం. అయితే ఆమే వ్రాసిన క్రింది. కొన్ని పంక్తులు నాకు బాగానచ్చాయి. 'కేప్‌టౌన్ ప్రజలకు టేబల్ మౌంటెన్ మిత్రుని వలె సహకరిస్తుంది. ఎత్తైనది కానందున అది భయంకరంగా వుండదు దూరాన్నుంచే దాన్ని పూజించవలసిన అవసరం వుండదు, దగ్గరకు వెళ్ళి పర్వతం మీదనే ఇండ్లు కట్టుకొని నివసించవచ్చు. సముద్రతీరాన వుండటం వల్ల సముద్రం తన స్వచ్చమైన జలంతో దాని పాదపూజ చేస్తుంది. దాని చరణామృతాన్ని సేవిస్తుంది పిల్లలు, పెద్దలు, స్త్రీలు పురుషులు నిర్భయంగా పర్వతప్రాంతమంతా తిరుగుతూ వుంటారు. వేలాది మంది పౌరుల కంఠస్వరాలతో పర్వత ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తూ వుంటుంది. పెద్ద పెద్ద చెట్లు సువాసనలు విరజిమ్మే రంగురంగుల పూలు పర్వతప్రాంతాన్నంతటినీ సువాసనల మయం చేస్తాయి. ఆ సౌందర్యం ఆశోభ, ఆ అందం చందం ఎంత చూచినా తనివితీరదు యిది ఆమె కవితల సారాంశం

మన గంగాయమునలతో పోల్చతగిన నదులు దక్షిణాఫ్రికాలో లేవు అక్కడవున్న కొద్దినదులు మనదేశ పునాదులతో పోలిస్తే చిన్నవే అని చెప్పవచ్చు. అక్కడి చాలా ప్రాంతాలకు నదులనీరు చేరదు. ఎత్తైన ప్రదేశాలకు క్రిందినుంచీ నీటిని కాలువలు త్రవ్వి ఎలా తీసుకువెళ్ళడం? సముద్రమంతటి నదులు లేని చోట కాలువలు ఎలా ఏర్పడతాయి? దక్షిణాఫ్రికాలో నీరు దొరకని చోట్ల పాతాళ బావులు త్రవ్వ బడివున్నాయి. ఆ బావుల నీటితో వ్యవసాయం సాగుతుంది. ఆ బావుల నుంచినీరు, యంత్రాల ద్వారా నీరు తోడే చక్రాల ద్వారా బయటికి తోడుతారు వ్యవసాయానికి ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుంది. రైతులకు ఎప్పటికప్పుడు సరియైన సలహాలు యిచ్చి తోడ్పడుటకు వ్యవసాయ శాస్త్ర నిపుణుల్ని