పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

జనరల్ స్మట్స్ చేసిన నమ్మక ద్రోహం?


నష్టం అనుకోరు కానీ దీవాళా తీసినప్పుడు నూరుశాతం డబ్బు పొందలేరు కనుక. అప్పుయిచ్చేవాళ్ళు తమ వద్ద అప్పు తీసుకునే వాళ్ళని దివాళా తీయనివ్వరు

కాఛలియా దీవాళా తీయటంవల్ల ఆంగ్లేయ వ్యాపారులు సత్యాగ్రహులైన వ్యాపారులను యిక బెదిరించే అవకాశం లేదనిపించింది. అలా జరిగింది కూడా వారి ఉద్దేశ్యం కాఛలియాను సత్యాగ్రహం నుంచి తప్పించటమే అలా చేయలేని పక్షంలో అతని నుంచి నూటికి నూరు శాతం డబ్బు వసూలు చేయాలి కదా! కాని వారి ఆశలు రెండూ నెరవేరలేదు. పైగా పరిస్థితి వారికి వ్యతిరేకం అయింది. ఒక పేరొందిన భారతీయ వ్యాపారస్థుడు దివాళా తీయటాన్ని సంతోషంగా ఆహ్వానించటం ప్రప్రధమంగా చూసిన తెల్ల ప్యాపారులందరూ తెల్ల బోయారు శాశ్వతంగా మూగపోయారు కూడా ఒక సంవత్సరంలోపే కాఛలియాకు వస్తువులవల్ల నూటికి నూరుశాతం డబ్బూ తిరిగి ముట్టింది. దివాళా దారుని వద్దనుంచి నూటికి నూరుశాతం డబ్బూ అప్పుయిచ్చిన వారికి అందటం దక్షిణాఫ్రికా చరిత్రలోనే మొదటి ఉదాహరణ ఈ కారణంగా మా సత్యాగ్రహ యుద్ధం ఓవైపు నడుస్తూ వుంటే మరో వైపు తెల్ల వ్యాపారస్థులకు కాఛలియాపై గౌరవం పెరిగిపోతూ వున్నది. ఈ సత్యాగ్రహంలో పాలుపంచుకుంటున్న కాఛలియాకు కోరినంత డబ్బు అప్పుగా యిచ్చేందుకు వారు సన్నద్దులయ్యారు. కాఛలియా బలం కూడా రానురాను పెరిగిపోయింది. సత్యాగ్రహ రహస్యాలు వారికి బాగా తెలిశాయి. యీ సత్యాగ్రహం ఎప్పటిదాకా కొనసాగుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు అందువల్ల దివాళా తీసినట్టుగా ప్రకటించిన తరువాత ఎటువంటి పెద్ద వ్యాపారంలోనూ కాఛలియా తలదూర్చకూడదని నిర్ణయించుకున్నాం తన ఖర్చులు వెళ్లబుచ్చుకునేందుకు అవసరమైనంత మాత్రమే సంపాదించాలని, యుద్ధ సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేయకుండా ఉండాలని కాఛలియా నిర్ణయించుకున్నారు. అందువల్ల తెల్లవ్యాపారులు యివ్వదలచిన అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేదు