పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

215


పూర్తిగా నమ్మేస్తారు. మీ స్వవిషయాల్లో, యిలా వుంటే మాకేమీ బాధలేదు కాని దేశం విషయాల్లోనూ మీరిలాగే అమాయకులై వుంటే యిబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడిక దేశప్రజల్లో మునుపటి అవేశమూ ఉత్సాహమూ మొలకెత్తడం కష్టమేమో అనిపిస్తున్నది. మన దేశం గురించి మీకు బాగా తెలుసు అవి సోడాబుడ్డి వంటిది దాన్లో క్షణికంగా వచ్చే ఆ పొంగునే సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలి ఆ పొంగు చల్లారితే అంతా నీరుకారి పోయినట్లే

ఈ మాటల తూటాల్లో ఏ దురుద్దేశ్యమూ లేదు. ఇతర సందర్భాల్లోనూ యీ మాటలు నేను విన్నాను అందుకే నవ్వుతూనే నేను సమాధానమిచ్చాను - “మీరు అమాయకత్వమనుకునే అంశం నా వ్యక్తిత్వంలో విడదీయరాని భాగమైపోయింది అది అమాయకత్వంకాదు విశ్వాసం మన తోటి మానవులపై విశ్వాసం వుంచటం మనందరి కర్తవ్యం కానీ దీన్ని మీరు నాలోపమనుకుంటే మరో విషయమూ యోచించాలి నా సేవవల్ల దేశానికి లాభం చేకూరుతుందని మీరు అనుకుంటే, నా యీ లోపంవల్ల జరిగే నష్టాన్ని కూడా భరించక తప్పదు. ఇంతేకాక దేశం యొక్క ఆవేశం సోడాబుడ్డి లాంటి క్షణికమైన ఆవేశమని నేను, మీలా అనుకోను దేశంలో నేనూ మీరూ మనమంతా వున్నాం నా ఉత్సాహానికి ఆవేశానికీ మీరీ విశేషణాన్ని జోడించారంటే అవమానంగా భావిస్తాను మీరూ దీన్ని అవమానంగానే భావిస్తారనుకుంటాను ఒకవేళ మీరు దీన్ని అవమాసుగా భావించకపోతే మీ కొలబద్దతోనే దేశాన్ని కొలవాలనుకుంటే దేశాన్నే అవమానపరచినట్టు భావించవలసి వస్తుంది యిలాంటి పెద్దయుద్ధాల్లో ఎగుడు దిగుడులు ఎత్తుపల్లాలు తప్పపు మీ విరోధులతో మీరెంత స్పష్టంగా స్వచ్ఛంగా వున్నా, వాళ్ళు తమ నిజాయితీని వదులుకున్నప్పుడు మనమేం చేయగలం? దావావేసేందుకు ప్రామిసరీ నోట్లతో నావద్దకు చాలామంది వస్తుంటారు. ప్రామిసరీ నోటుపై దస్తూరీ చేసి మనచేతిని మనమే నరుక్కోవటం కంటే మించిన అసందిగ్ధత మరెక్కడ వుంటుంది. కానీ యిలాంటి వారికి వ్యతిరేకంగా కూడా కోర్టులో వాదించవలసి