పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

భూగోళము


మొక్కజొన్నయే కొన్ని చోట్ల గోధుమలు కూడా పండుతాయి. దక్షిణాఫ్రికా పండ్లకు బహుప్రసిద్ధి నేటాలులో అరటి, బొప్పాయి, అనన్సాసపుండ్లు అధికంగా లభిస్తాయి. కడుపేదవారు సైతం ఆ పండ్లుకొని తినగలిగినంత చౌకగా వుంటాయి. నేటాలు, మరియు తదితర రాజ్యాలలో నారింజ, బత్తాయిలు, ఎప్రికోట్ పండ్లు అత్యధికంగా లభిస్తాయి. గ్రామాల్లో చాలామంది పేదవారు సైతం యీ పండ్లు తింటారు. అక్కడ పండ్లు కారుచౌక కేఫ్ టౌన్ ద్రాక్ష పండ్లకు నిలయం. అక్కడ దొరికినంతగా ద్రాక్ష మరో చోట దొరకదు ద్రాక్షపండ్లు అమిత చౌకగా లభిస్తున్నందున కటిక పేదవాళ్ళు సైతం ద్రాక్ష తినగలిగిన స్థితిలో వున్నారు. భారతీయులు ప్రవేశించడం. మామిడిపండ్లు లభించడం సహజం భారతీయులు దక్షిణాఫ్రికాలో మామిడి మొక్కలు నాటారు యిప్పుడు దక్షిణాఫ్రికాలో మామిడిపండ్లు కూడా అధికంగా లభిస్తున్నాయి. రకరకాలమేలు రకం మామిడిపండ్లు, బొంబాయి, మామిడిపండ్లతో పోటీ పడగలిగినంతగా దొరుకుతున్నాయి. అక్కడ కూరలు బాగా లభిస్తాయి. భారతీయులు రకరకాల కూరకాయలు అధికంగా కాయిస్తున్నారని చెప్పవచ్చు

పశువులు కూడా అక్కడ ఎక్కువే భారత దేశంలో దొరికే ఆవులు ఎద్దులు కంటే దక్షిణాఫ్రికా యందలి ఆవులు, ఎద్దులు మంచి రూపం కలిగి, అమితబలిష్టంగా వుంటాయి. భారతదేశంలో గోరక్షణను గురించిన మాటలు ఎక్కువగా వింటూ వుంటాం కాని యిక్కడి ప్రజలవలెనే, యిక్కడి ఆవులు ఎద్దులు కూడా బక్క పలుచగా బలహీనంగా వుంటాయి. వాటిని చూచి నా హృదయం ద్రవించి పోతుంది సిగ్గుతో నా తలవంగిపోతుంది. దక్షిణాఫ్రికాలో బలహీనంగా వుండే అవుల్నిగాని, ఎద్దుల్ని గాని చూచిన జ్ఞాపకం లేదు దక్షిణాఫ్రికా యందలి ప్రాంతాలన్నిటి యందు కండ్లు తెరుచుకొని మరీ నేను పర్యటించాను కాని ఎక్కడా బక్కచిక్కిన గోవుల్ని వృషభాల్ని నేను చూడలేదు

ప్రకృతి యీ భూమికి ఎన్నో వరాలు ప్రసాదించింది. వాటితో బాటు సహజసౌందర్యాన్ని అపారంగాప్రసాదించిందని చెప్పవచ్చు. డర్బన్ ఎంతో అందంగా వుంటుంది అంతకంటే అందంగా వుంటుందికేఫ్ కాలనీ కేఫ్‌టౌన్,