పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

సహాయకులుగా వున్న తెల్లవారు

ఇప్పటివరకు నేను పరిచయం చేసిన వారంతా నాకు అప్తులు గాఢస్నేహితులు అయితే వాళ్లను ట్రాన్స్‌వాల్‌కు చెందిన ప్రముఖ ఆంగ్లేయుల జాబితాలో చేర్చుటకు వీలు లేదు. వారందరి సహాయం భారత జాతీయ సంగ్రామం సాగినప్పుడు మాకు అపారంగా లభించింది. వారిలో గౌరవ ప్రతిష్ఠల దృష్ట్యా శ్రీ హాస్కిన్ గారు ప్రముఖులు వారు దక్షిణాఫ్రికా చేంబర్స్ ఆఫ్ కామర్సు సంఘానికి మాజి అధ్యక్షులు ట్రాన్స్‌వాల్ అసెంబ్లీ మెంబరు వారిని గురించి యింతకు ముందే వ్రాశాను వారి అధ్యక్షతన సత్యాగ్రహసమరానికి సహాయం చేయుటకు తెల్లజాతీయుల సమితి ఒకటి స్థాపించబడింది. ఆ సమితి సత్యాగ్రహ సమర సమయంలో భారతీయులకు అమితంగా సాయం చేసింది. సంగ్రామం ఉధృత రూపం దాల్చిన తరువాత ప్రభుత్వాధినేతలతో సంభాషించడం కుదరని పని గదా అక్కడి ప్రభుత్వం తన చట్టాల్ని ఉల్లంఘించేవారితో మంచిగా వ్యవహరిరంచకపోవడమే అందుకు కారణం. అటువంటి సమయంలో తెల్లజాతీయుల సహాయ సమితి యిరువురికి మధ్య మధ్యవర్తిత్వం వహించి పనిచేసింది.

శ్రీ ఆల్బర్ట్ కార్డ్‌రైట్‌గారిని గురించి ముందే వివరంగా వ్రాశాను రెవరెండ్ డోక్ మాదిరిగా మాకు బాగా సహకరించిన మరో పాదిరి వున్నారు. వారి పేరు రెవరెండ్ చార్ట్స్ ఫిలిప్స్ వారు ట్రాన్స్‌వాల్ యందు ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రిగేషనల్ మినిస్టరుగా వున్నారు. ఆయన సతీమణి కూడా మాకు ఎంతో సహాయం చేశారు. మూడో ప్రసిద్ధ పాదరీ రెవరెండ్ డుడినీడ్రూ వారు పాదిరీ పదవిని విరమించుకొని బ్లుంఫోన్టీన్ నుంచి వెలువడే దిఫ్రండ్ అనుదిన పత్రికకు సంపాదకులుగా పని చేశారు. వారు తెల్ల జాతి వారి అవమానాల్ని భరించి భారతీయుల సంగ్రామాన్ని సమర్థిస్తూ ఎన్నో వ్యాసాలు తమ పత్రికలో ప్రచురించారు. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రసిద్ధ వక్తల్లో ఒకరుగా వారికి ప్రఖ్యాతి లభించింది.

ఇదేవిధంగా మాకు సహకరించిన తెల్లజాతీయుడు ది ప్రిటోరియా న్యూస్ అను పత్రికా సంపాదకులు శ్రీ బేర్‌స్టెంట్ ఒక సారి ప్రిటోరియా టౌను